Bcci not selected team for australia and srilanka series

india australia test latest updates, india australia test series team, india australia test schedule, india srilanka odi team, india srilanka odi schedule, bcci latest news, cricket india latest, spot fixing report

bcci not selected team for australia and srilanka series : bcci selection committee not selected team for australia test series and srilanka fourth, fifth one day matches because of issues with bcci board

ఆటగాళ్లతో ఆడుకుంటన్న బీసీసీఐ

Posted: 11/04/2014 06:41 PM IST
Bcci not selected team for australia and srilanka series

బీసీసీఐ, సెలక్షన్ బోర్డు మద్య ఉన్న విభేదాల కారణంగా క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో రెండు సిరీస్ లు ఉన్నప్పటికి ఇప్పటివరకు ఈ మ్యాచ్ లకు జట్లను మాత్రం ఖరారు చేయలేదు. ఇందుకు కారణం సెలక్షన్ కమిటీతో బోర్డుకు ఉన్న అభిప్రాయ బేధాలే అని తెలుస్తోంది. సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం రోజు ముంబైలో సమావేశం అయింది. ఈ భేటీలో త్వరలో ఆస్ర్టేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్ లతో పాటు, శ్రీలంకతో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో చివరి రెండు వన్డేలకు జట్లను ఖరారు చేయాల్సి ఉంది.

కానీ జట్లను ప్రకటించకుండానే సమావేశం ముగించారు. స్పాట్ ఫిక్సింగ్ పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 10న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ీ నేపథ్యంలో కోర్టు తీర్పు తర్వాతే జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు గత ఫిక్సింగ్ తో సంబంధం లేకపోయినా., సెలక్షన్ కమిటీ మాత్రం ప్రస్తుతానికి జట్ల ఎంపికకు ఆసక్తి చూపలేదు.

సెలక్షన్ కమిటీ, బోర్డు వైఖరిపై క్రికెటర్ల నుంచి ఆశ్చర్యంతో పాటు అసహనం వ్యక్తం అవుతోంది. ఎవరెవరు ఎంపికయ్యారో ప్రకటిస్తే తాము ప్రాక్టీస్ ఇతర షెడ్యూల్ తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా సమయం అంతా దగ్గరపడ్డాక జట్టును ప్రకటిస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ లాంటి ఆట విషయంలో ఇలా విభేదాలు పెట్టుకుని వ్యవహరిస్తే దేశానికి ఇబ్బందులు తప్పవని క్రీడా విశ్లేషకులు కూడ అంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  selection committee  cricket  sports  

Other Articles