India bowlers to get england out twice

India bowlers to get England out twice, Dilip Vengsarkar, england series, Indian fast bowlers

To win a Test in England, you have to bowl them out twice, and the Indian bowling attack lacks just that, felt former India captain Dilip Vengsarkar

భారత బౌలర్లకు ఆ సత్తా లేదు : వెంగీ

Posted: 06/07/2014 11:59 AM IST
India bowlers to get england out twice

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ వెంగ్ సర్కార్ భారత ప్రస్తుత బౌలర్లను చులకన చేస్తూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. త్వరలో భారత జట్టు ఇంగ్లాండ్ లో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతుంది. ఈ పర్యటనలో భారత జట్టు బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ను ఒకే టెస్టులో రెండు సార్లు ఆలౌట్ చేసే సత్తా లేదని, స్వదేశంలో ఇంగ్లండ్ బలమైన జట్టని వెంగ్సర్కార్ అభిప్రాయ పడ్డారు.

అయినప్పటికీ.. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విజయం సాధించాలని కాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. భారత జట్టు బౌలింగ్ భారాన్ని ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, వరుణ్ ఆరోన్, అశ్విన్‌లపైనే పడనుందని ఆయన చెప్పారు.

వెంగ్ సర్కార్ తన అభిప్రాయం అని మాత్రమే చెబుతున్నా, విదేశీ పర్యటనకు ముందు భారత బౌలర్లకు సత్తా లేదని ఇలా ప్రకటిస్తే ప్రత్యర్థి జట్టుకు మరింత బలం, విశ్వాసం పెరుగుతుందని, తన అభిప్రాయాల్ని ఇలా బహిర్గతం చేయడం సమంజసం కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మరి వెంగ్ సర్కార్ నోరు మూయించే విధంగా ఇంగ్లాండ్ లో మనవారు ప్రదర్శన కనబరుస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles