Maria sharapova will face simona halep final

Maria Sharapova, Simona Halep, french open final, Maria Sharapova,

Maria Sharapova needs all her battling qualities to beat Eugenie Bouchard and set up a French Open final against Simona Halep.

ఫ్రెంచ్ ఓపెన్ : షరపోవా వర్సెస్ హెలెప్

Posted: 06/06/2014 10:58 AM IST
Maria sharapova will face simona halep final

తన అందాలతోనే కాకుండా, ఆటతో కూడా ప్రేక్షకుల్ని అలరించే అందాల సుందరి రష్యా భామ మారియా షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగ్సల్ విభాగంలో అద్బుతమైన ఆట తీరుతో మూడోసారి ఫైనల్లోకి చేరింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఏడోసీడ్ షరపోవా 4-6, 7-5, 6-2తో 18వ సీడ్ యూబిన్ బౌచర్డ్ (కెనడా) పై విజయం సాధించింది. గంటా 27 నిమిషాల పాటు జరిగిన హొరా హోరి పోరులో షరపోవా నెగ్గి, ఫైనల్లో హెలెప్ తో తుది పోరుకు సిద్దం అయ్యింది.

తొలి సెట్ ని చేజార్చుకున్న తరువాత రెండో సెట్ లో పోరాడి నెగ్గిన షరపోవా మూడో సెట్ ని అలవోకగా నెగ్గింది. రెండోసెట్‌లో దూకుడును ప్రదర్శించిన షరపోవా 4-1, 5-2 ఆధిక్యాన్ని సంపాదించినా కీలక సమయంలో సర్వీస్‌ను చేజార్చుకుంది. ఇదే క్రమంలో నాలుగు సెట్ పాయింట్లను కోల్పోయి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. దీంతో బౌచర్డ్ 5-5తో స్కోరును సమం చేసింది. ఇక పట్టు వదలకుండా పోరాడిన రష్యన్ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు ఆరో సెట్ పాయింట్‌ను గెలుచుకుని సెట్‌ను చేజిక్కించుకుంది. తర్వాత వరుస పాయింట్లతో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

మరో సెమీ ఫైనల్లో నాలుగో సీడ్ హెలెప్ 6-2, 7-6, 7-4 తో పెట్కోవిచ్ (జర్మనీ) ని ఓడించి గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. హెలెప్ మూడు సంవవత్సరాల్లో 450 స్థానాలు మెరుగుపర్చుకొని, నాలుగో ర్యాంకుకు చేరింది. దీనికి కారణం ఆమె వక్షోజాలను తగ్గించుకోవడమే అట. మొదట్లో భారీ స్థన సౌందర్యం కారణంగా మైదానంలో కదల్లోక చాలా ఇబ్బంది పడిన ఈమె శస్త్ర చికిత్స ద్వారా బరువుల్ని తగ్గించుకుందట. ఏమైతేనేం బరువులు తగ్గించుకొని తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టిన ఈమె షరపోవాను నిలువరిస్తుందా లేదా చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles