Uthappa rahane guide india to 7 wicket win

India to 7 wicket win, Bangladesh vs India, Bangladesh vs India 2014, Cricket,Indian Cricket,Ajinkya Rahane,Robin Uthappa,Cricket

Robin Uthappa and Ajinkya Rahane guided India to a comprehensive seven-wicket win.

మనోళ్ళు జోరుమీదున్నారు

Posted: 06/16/2014 01:40 PM IST
Uthappa rahane guide india to 7 wicket win

ఇటీవలే ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఆ టోర్నీలో అప్పుడప్పుడు మిగతా దేశాల ఆటగాళ్ళు మెరిసినా... ఒవరాల్ గా చూస్తే భారత యువ ఆటగాళ్ళే చక్కగా రాణించారు. ఇదే ఊపులో బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ ని సీరియర్లు లేకుండా వెళ్లారు. రైనా నేతృత్వంలో బంగ్లా వెళ్లిన ఈజట్టు తొలి వన్డేలో సమిష్టిగా రాణించి అలవోకగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బంగ్లాతో షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి యువ సత్తా చాటుకుంది.

వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 150 పరుగులుగా నిర్ణయించారు. టీమిండియా 24.5 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ముందుగా టాస్ గెలిచి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (63 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ అల్ హసన్ (58 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... అనాముల్ హక్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), మహ్ముదుల్లా (44 బంతుల్లో 41; 6 ఫోర్లు) రాణించారు.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ స్కోరు 16.4 ఓవర్లలో 100 పరుగులకు చేరిన దశలో భారీ వర్షం కురిసి మ్యాచ్‌కు చాలా సమయం పాటు అంతరాయం కలిగింది.  అజింక్య రహానే (70 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో రాణించిన రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు దక్కింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles