Kolkata knight riders win ipl 7

Kolkata Knight Riders Win IPL-7, KKR Win IPL 2014, Kolkata Knight Riders, Kolkata Knight Riders Win IPL

Kolkata Knight Riders Win IPL-7

ఐపిఎల్ టైటిల్ సొంతం చేసుకున్న కోల్‌కతా

Posted: 06/02/2014 09:43 AM IST
Kolkata knight riders win ipl 7

క్రీడాభిమానులను సుమారు నెలన్నర పాటు ఉర్రూతలూగించిన ఏడో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ముగిసింది. తొలిసారి టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది.

కోల్‌కతా మళ్లీ సాధించింది...రెండేళ్లనాటి అద్భుత ప్రదర్శనను పునరావృతం చేసింది. సీజన్ ఆరంభంలో పేలవంగా ఆడిన గంభీర్ సేన... టోర్నీ ద్వితీయార్ధంలో సంచలన ఆటతీరు కనబరచింది. ప్రత్యర్థి భారీ స్కోరు చేసినా బెదరకుండా... ఆత్మవిశ్వాసంతో ఆడి షారుఖ్‌కు మరో టైటిల్‌ను కానుకగా అందించింది.

రెండు కొదమసింహాల్లాంటి జట్ల మధ్య జరిగిన భారీ స్కోర్ల పోరాటంలో పంజాబ్ చేతులెత్తేసింది. సాహా అద్భుతమైన సెంచరీ చేసినా ప్రీతి జింటా టైటిల్ కరవును తీర్చలేకపోయాడు. ఫైనల్లో కోల్‌కతా గెలిచినా... రెండు జట్ల పోరాటంతో క్రికెట్ అభిమానులు మాత్రం చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు.

KKR-Win-IPL-2014

బెంగళూరు: మూడు వారాల క్రితం... ఈ సీజన్ ఐపీఎల్‌లో సగం మ్యాచ్‌లు ముగిశాక... కోల్‌కతా టైటిల్ గెలుస్తుందని ఎవరైనా అంటే అదో పెద్ద జోక్. తాము ప్లే ఆఫ్‌కు చేరడమే గొప్ప అని ఆ జట్టు కెప్టెన్ స్వయంగా చెప్పిన పరిస్థితి. అలాంటి కోల్‌కతా మ్యాజిక్ చేసింది. వరుసగా 9వ మ్యాచ్‌లో గెలిచి ఔరా అనిపించింది.

ఇన్నాళ్లూ గెలిచిన మ్యాచ్‌లు ఒకెత్తయితే... ఈసారి ఫైనల్లో పంజాబ్‌ను ఓడించడం మరో ఎత్తు. వరుసగా రెండు సార్లు కోల్‌కతా చేతిలో ఓడి కసి మీదున్న పంజాబ్ తమ సర్వశక్తులూ ఒడ్డి భారీ స్కోరు సాధించినా... సమష్టి మంత్రంతో రాణించిన నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-7 విజేతగా నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో... టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.

పైజ్‌మనీ

కోల్‌కతా: రూ. 15 కోట్లు

పంజాబ్: రూ. 10 కోట్లు

18904 ఈ సీజన్ ఐపీఎల్‌లో మొత్తం పరుగులు

3 నమోదైన సెంచరీలు

671 సీజన్‌లో మొత్తం వికెట్లు

36 అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు (మ్యాక్స్‌వెల్)

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles