Virender sehwag ton sets up panjab first final

panjab kings XI first final, Indian Premier League, IPL 2014, Suresh Raina, CSK, Chennai Super Kings, Cricket News, Cricket

Virender Sehwag rolled back the years with a joyously punchy 58-ball 122 to power Kings XI Punjab to 226 for 6, a total that proved enough to seal their passage to the IPL.

వీరేంద్రుడి జోరుకు చెన్నై బేజారు

Posted: 05/31/2014 08:11 AM IST
Virender sehwag ton sets up panjab first final

ఐపీఎల్ టోర్నీ ఏడో సీజన్ కి కూడా విజయ వంతంగా పూర్తి చేసుకోబోతుంది. ఇన్ని సీజన్లో జరిగిన ఎన్నో అద్భుతాలలో నిన్న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మరో అద్భుతం. చూసే వారి కళ్ళు గ్రౌండ్ లో కాకుండా స్టాండ్ లోనే అటూ ఇటూ చూడాల్సి వచ్చింది.  బ్యాట్స్ మెన్స్ చేస్తున్న విధ్వంసానికి బాల్ ఎక్కడపడుతుందో చూడటానికే సరిపోయింది. అంతగా సాగింది పంజాబ్, చెన్నై జట్లు మధ్య రెండో క్వాలిఫయర్. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ పరుగుల తుఫాన్ స్రుష్టించి అందరి చేత ఔరా అనిపించుకుంటే, చెన్నై బ్యాట్స్ మెన్స్ సునామీ స్రుష్టించి అందరి నోళ్లు వెల్లబెట్టుకునేలా చేశారు. రెం

డు జట్ల మధ్య ఆధ్యంతం నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ‘పంజాబే ’ కింగ్ గా నిలిచి, తొలిసారి ఐపీఎల్ ఫైనల్లో అగుడు పెట్టి తన సత్తా చాటితే, ఆరోసారి కూడా ఫైనల్లోకి వెళ్లాళని చూసిన చెన్నైకి నిరాశ మిగిల్చింది. లీగ్ దశ నుండే అద్బుతంగా ఆడుతూ ఉన్న పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ లో చెలరేగి ఆడింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 24 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ (58 బంతుల్లో 122; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ సెంచరీ సాధించగా, మిల్లర్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (31 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు.

ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై ఆది నుండే ధాటిగా ఆడినా, చివర్లో చేతులెత్తేసింది. సురేశ్ రైనా (25 బంతుల్లో 87; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని (31 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా, మిగతా బ్యాట్స్ మెన్స్ రాణించక పోవడంతో చెన్నై ఇంటి ముఖం పట్టక తప్పలేదు. ఇప్పటికే ఫైనల్ కి చేరిన కోల్ కత్తాతో పంజాబ్ ఆదివారం నాడు ఢీ కొనబోతుంది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ ని చిత్తు చేసిన కోల్ కత్తా ఫైనల్లో కూడా చిత్తు చేసి రెండో ఐపీఎల్ కప్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles