Kolkata on the streets dance shahrukh 2014

Shahrukh Khans dance at Kolkata 2014, Shah Rukh might promise dancing, streets dance shahrukh 2014, KKRs grand felicitation at Eden, Kolkata celebrates Shah Rukh, Kolkata Knight Riders, Shahrukh khan And Mamata Banerjee, IPL- win 2014.

kolkata on the streets dance shahrukh 2014, Shahrukh khan And Mamata Banerjee to Celebrate Knight, KKR`s grand felicitation at Eden

ఘన సన్మానం- వీధుల్లో చిందేస్తాం: షారుఖ్

Posted: 06/03/2014 10:59 AM IST
Kolkata on the streets dance shahrukh 2014

రెండోసారి ఐపిఎల్ కప్ సాధించటంతో.. ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ కు ఆనందంతో ఊగిపోతున్నాడు. బెంగాల్ రాజధాని కోల్‌కతా మరోసారి వేడుకలకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ ఏడో సీజన్ టైటిల్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు నేడు ఈడెన్ గార్డెన్స్‌లో ఘన సన్మానం జరుగనుంది.

ముఖ్య అతిథిగా సీఎం మమతా బెనర్జీ హాజరుకానున్నారు. విజయయాత్రలో జట్టు యజమాని షారుఖ్ ఖాన్ తన నృత్యాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కోల్‌కతా వీధులను సందడిగా మారుస్తామని చెబుతున్నాడు. ఈ విజయాన్ని తన చిన్న కుమారుడు అబ్‌రామ్‌కు అంకితమిస్తున్నట్టు చెప్పాడు. ‘ఈసారి హుగ్లీ నది ఒడ్డున డ్యాన్సులతో ఉర్రూతలూగిస్తాం.

అలాగే వీధులను కూడా వదలం. మమతాజీ... ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగానే మేం మరోసారి వస్తున్నాం. మేం ఇప్పుడు చాంపియన్లం. పార్టీ ఇప్పటికే ప్రారంభమైంది’ అని షారుఖ్ తెలిపాడు. ఫైనల్లో పంజాబ్‌ను ఓడించిన అనంతరం తమ టీమ్ హోటళ్లో తెల్లవారు జాము దాకా ఆటగాళ్లు పార్టీలో మునిగితేలారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles