Royal challengers win against sunrisers

Bangalore won by 4 wkts, Royal Challengers Bangalore Vs Sunrisers Hyderabad, M.Chinnaswamy Stadium, Bengaluru, RCB beat SRH by 4 wickets

AB De Villers guides Royal Challengers Bangalore to astonishing win against Sunrisers Hyderabad.

డివిలియర్స్ ధాటికి చిన్నపోయిన సన్ రైజర్స్

Posted: 05/05/2014 10:27 AM IST
Royal challengers win against sunrisers

యూఏఈలో జరిగిన తొలి సీజన్ ఐపీఎల్లో బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకొని, పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది. కానీ స్వదేశంలో అడుగుపెట్టగానే ఆ జట్టుకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చిందేమో... సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో అద్బుత విజయాన్ని సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో విఫలం అవుతూ కేవలం 73 పరుగులే చేసిన దక్షిణాఫ్రికా స్టార్ ఏడీ డెవిలియర్స్ బెంగుళూరులో పరుగుల సునామీ స్రుష్టించి 89 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇప్పటి వరకు జరిగిన టి 20 మ్యాచ్ ఇన్నింగ్స్ లో చిరస్థాయిలో నిలిచిపోయే వాటిల్లో ఇదొకటని చెప్పవచ్చు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. వార్నర్ (49 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా, ధావన్ (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు.

స్టార్ బ్యాట్స్ మెన్స్ ఉన్న బెంగుళూరుకు హైదరాబాద్ ఉంచిన లక్ష్యం చిన్నదే అయినా హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఆదిలోనే కోహ్లీ, గేల్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఓ దశలో 64 పరుగులే నాలుగు వికెట్లు కోల్పోయి, 54 బంతుల్లో 95 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో డివిలియర్స్ 41 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం చూపాడు. సిక్సర్ల వర్షంతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. డివిలియర్స్‌తో పాటు గేల్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.  డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles