Chennai super kings to 8 wicket win over delhi

chennai win over Delhi, chennai beat delhi, chennai win by 8 wickets in delhi, Dwayne Smith., suresh raina, ms dhoni

Dwayne Smith cracked a blistering 79 as a dominant Chennai Super Kings steamrolled Delhi Daredevils by eight wickets for their sixth straight win in the IPL, in New Delhi on Monday.

చెన్నై డబుల్ హ్యాట్రిక్

Posted: 05/06/2014 10:43 AM IST
Chennai super kings to 8 wicket win over delhi

ఐపీఎల్ టోర్నీలు బాగా అచ్చొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ టోర్నీలో కూడా తనదైన శైలిలో రాణిస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా, లక్ష్యం ఎంతదైనా ఆజట్టు అలవోకగా ఛేదిస్తూ అగ్ర స్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వరుసగా ఐదు విజయాలు సాధించిన ఈ జట్టు ఆరో విజయాన్ని కూడా నమోదు చేసుకొని సూపర్ కింగ్స్ అనిపించుకుంది. భారీ లక్ష్యాన్ని సింపుల్ గా ఛేదించి ఢిల్లీని మట్టికరిపించింది.

నిన్న రాత్రి ఢిల్లీ సొంత గడ్డ పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించి జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు విజయ్ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), డి కాక్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి ఢిల్లీ జట్టుకు శుభారంభం అందించారు.

అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (51 బంతుల్లో 79; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రైనా (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైని గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 44 బంతుల్లోనే 86 పరుగులు జోడించడం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles