Ravichandran ashwin arjuna award

Ravichandran Ashwin, Arjuna Award, BCCI, ravichandran ashwin arjuna award, award in 2012-13 season, Indian off-spinner, Ravichandran Ashwin, BCCI recommends Ravichandran.

ravichandran ashwin arjuna award, BCCI recommends Ravichandran Ashwin for Arjuna Award

రవిచంద్రన్ అశ్విన్‌కు ‘అర్జున’ బిసిసిఐ ప్రతిపాదన

Posted: 04/26/2014 04:00 PM IST
Ravichandran ashwin arjuna award

స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును అర్జున అవార్డుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. 2012-13 సీజన్‌లో అత్యుత్తమ ఆటగాడిగా పాలీ ఉమ్రీగర్ అవార్డునుస్వీకరించిన అశ్విన్ పేరును కేంద్రానికి సిఫార్సు చేశామని బోర్డు జనరల్ మేనేజర్ రత్నాకర్ శెట్టి ధ్రువీకరించాడు. 

ఈనెల 30వ తేదీలోగా అర్జున అవార్డుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉందన్నాడు. క్రికెట్‌కు సంబంధించి అశ్విన్ ఒక్కడి పేరునే ప్రతిపాదించామని వివరించాడు. గత 80 ఏళ్లలో అత్యంత వేగంగా టెస్టుల్లో వంద వికెట్ల మైలురాయిని దాటిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. 

సచిన్ తెండూల్కర్‌కు వీడ్కోలు మ్యాచ్‌గా పేర్కొనే ముంబయి టెస్టులో అతను వెస్టిండీస్‌పై అద్భుతంగా రాణించి, టెస్టు వికెట్ల సెంచరీ పూర్తి చేశాడు. 27 ఏళ్ల అశ్విన ఇప్పటి వరకూ 104 టెస్టు, 106 వనే్డ వికెట్లు సాధించాడు. కాగా, గత ఏడాది కోహ్లీకి అర్జున అవార్డు లభించింది. ఇప్పటి వరకూ పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 46 మందికి ఈ అవార్డు దక్కింది.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles