Royal challengers bangalore vs kings xi punjab

Virat Kohli, Except for skipper Virat Kohli, IPL 2014, Kings XI Punjab, Royal Challengers Bangalore.

virat kohli : Royal Challengers Bangalore vs Kings XI Punjab

విరాట్ కోహ్లీ సేనకు సవాలు!

Posted: 04/28/2014 10:50 AM IST
Royal challengers bangalore vs kings xi punjab

టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా ముద్ర వేయించుకున్న యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈరోజు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నుంచి గట్టి సవాలును ఎదుర్కోనుంది. బ్యాటింగ్ విభాగంలో ఎంతో బలంగా కనిపిస్తున్న బెంగళూరు శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 70 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. 

మరోవైపు భారీ స్కోర్లను సాధిస్తూ మంచి ఫామ్‌లో కొనసాగుతున్న పంజాబ్ శనివారం నాటి మ్యాచ్‌లో 132 పరుగులకే పరిమితమైంది. అయితే, బౌలింగ్‌లో అనూహ్యంగా విజృంభించి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 109 పరుగులకే కట్టడి చేయడం ద్వారా విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ ఈ జట్టు పటిష్టంగా ఉందని శనివారం నాటి మ్యాచ్ రుజువు చేసింది. 

అన్ని విభాగాల్లోనూ ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నందున పంజాబ్ అజేయ జట్టుగా నిలవగా, మిగతా జట్లు సమర్థులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో వారి వైఫల్యాల కారణంగా పరాజయాలను ఎదుర్కొంటున్నాయి. బెంగళూరు పరిస్థితి ఇదే విధంగా ఉంది.

కలకత్తా నైట్ రైడర్స్‌ను తక్కువ స్కోరుకే నిలువరించడమే పంజాబ్ బౌలింగ్ సామర్థ్యానికి నిదర్శనం. నిజానికి కాగితంపై చూస్తే పంజాబ్ కంటే బెంగళూరు పటిష్టంగా కనిపిస్తున్నది. అయితే, సమష్టి బాధ్యతను ఎవరూ స్వీకరించకపోవడమే సమస్యలు సృష్టిస్తున్నది. ఈ లోపాన్ని సవరించుకొని, సమష్టిగా పోరాడితే తప్ప ఈరోజు జరిగే   మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించడం బెంగళూరుకు సాధ్యం కాదు. కానీ, ఈ జట్టును తేలిగ్గా తీసుకోరాదని గతంలో పలు సందర్భాల్లో స్పష్టమైంది. దీనిని పంజాబ్ తప్పక గుర్తుంచుకోవాలి.

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles