Sunrisers power to first win

Sunrisers Hyderabad, Delhi Daredevils, IPL 7, IPL 2014, Sunrisers power to first win

Sunrisers power to first win

మొదటి బోణీ కొట్టిన సన్ రైజర్స్

Posted: 04/26/2014 02:46 PM IST
Sunrisers power to first win

ఏడో ఇండియన్ ప్రీమియర్ (ఐపిఎల్)లో వరుసగా రెండు మ్యాచ్‌లను చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్  బోణీ చేసింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను నాలుగు పరుగుల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన ఢిల్లీ నాలుగు వికెట్లకు 180 పరుగులు చేయగలిగింది. 

కాగా, రెండు మ్యాచ్‌ల్లో వేధించిన బ్యాటింగ్ వైఫల్యాల నుంచి సన్‌రైజర్స్ బయటపడడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టు 56 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33 పరుగులు చేసి షాబాజ్ నీషమ్ వౌలింగ్‌లో కెవిన్ పీటర్సన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అనంతరం ఆరోన్ ఫించ్‌తో కలిసిన డేవిడ్ వార్నర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 128 పరుగులు జోడించారు. కేవలం ఒక వికెట్ నష్టపోయిన సన్‌రైజర్స్ 184 పరుగులు చేసింది. ఫించ్ 53 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 88, వార్నర్ 45 బంతుల్లో, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కూడా ఇన్నింగ్స్‌ను ధాటిగానే మొదలుపెట్టింది. క్వింటన్ డికాక్, మురళీ విజయ్ మొదటి వికెట్‌కు 99 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. 30 బంతుల్లో, ఆరు ఫోర్లు ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసిన డికాక్‌ను ఫించ్ క్యాచ్ పట్టగా కరన్ శర్మ అవుట్ చేయడంతో మొదటి వికెట్‌ను కోల్పోయింది. 

చివరి ఓవర్‌లో విజయానికి 20 పరుగుల అవసరంకాగా, భువనేశ్వర్ కుమార్ వేసిన ఆ ఓవర్‌లో ఢిల్లీకి 15 పరుగులు లభించాయి. పరుగు ల వేటలో ఢిల్లీ కేవ లం ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. నాలుగు ప రుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయభేరి మోగించింది. టాప్ స్కోరర్ ఫించ్‌కి ప్లే యర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles