Asia cup in bangladesh on 25th february

Asia Cup,Asia Cup 2014,Asia Cup 2014 fixtures,Asia Cup 2014 Schedule,India Vs Pakistan,Virat Kohli

The 2014 Asia Cup kicks off on February 25, 2014 and the final will be played on March 8, 2014.

ఆసియా కప్ టోర్నీ నేటి నుండే

Posted: 02/25/2014 11:13 AM IST
Asia cup in bangladesh on 25th february

ఉపఖండ దేశాలు మినీ వరల్డ్ కప్ గా భావించే ఆసియా కప్ క్రికెట్ టోర్నీ సమరానికి నేటి నుండి తెర లేవనుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాలు పాల్గొని తన అద్రుష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇప్పటి వరకు ఆసియా కప్ ను ఎక్కువసార్లు (ఐదు సార్లు) కైవసం చేసుకున్న జట్టుగా భారత్ ఉండగా, తరువాతి స్థానంలో శ్రీలంక (నాలుగు సార్లు) పాకిస్థాన్ (రెండు సార్లు) ఉన్నాయి.

అయితే ఈసారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా నాలుగు జట్లు బరిలో దిగబోతున్నాయి.  గత కొంత కాలం నుండి విదేశాల్లో మన జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే ఉన్నా, స్వదేశంలో, ఉపఖండంలో మంచి ట్రాక్ రికార్డు ఉండటం, కెప్టెన్ ధోని గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో... కోహ్లి సారథ్యంలోని యువ జట్టు ఆరోసారి కిరీటాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది.

ఈసారి హాట్ ఫేవరెట్ శ్రీలంకేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా, ఎందుకంటే ఆ జట్టు గతకొన్ని రోజుల క్రితం ఆ దేశంలో పర్యటించి, అన్ని ఫార్మాట్లలో గెలిచింది. దీంతో అక్కడి వాతావరణం, పిచ్ లు శ్రీలంకకు బాగా అనుకూలించడమే కాకుండా, జట్టులో చాలా సీనియర్ ఆటగాళ్ళు ఉండటంతో జట్టు బలంగా కనిపిస్తుంది.

పసికూన ముద్ర నుండి సంచలనాల జట్టుగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ గతంలో భారత్ వంటి అగ్ర జట్లకు షాక్ ఇచ్చింది. ఇటీవల స్వదేశంలో జరిగిన టోర్నీలో లంకేయులకు కూడా గట్టి పోటీనిచ్చి మాలో గెలిచే సత్తా ఉందని నిరూపించింది. గత ఆసియా కప్ లో ఫైనల్ చేరి పాకిస్థాన్ చేతిలో ఓడిన ఈ జట్టు ఈ సారి కూడా అగ్ర జట్లకు గట్టి పోటీనివ్వడానికి సిద్దంగా ఉంది.

పసికూన ఆఫ్గానిస్థాన్ ఇప్పటి వరకు వన్డేలు, టి20లు ఆడినా వారి కెరియర్లో ఆడుతున్న పెద్ద టోర్నీ ఇదే. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా తనదైన ముద్ర వేయాలని చూస్తుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడబోతున్న ఈ జట్టుకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

ఇక డిపెండింగ్ ఛాంపియన్ అయిన పాకిస్థాన్ జట్టు ఈసారి కూడా కప్పును ఎగరేసుకుపోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉన్న జట్టు భారత్ కి, లంకకు గట్టి పోటీనిచ్చి కప్పును ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొత్తంగా నేటి నుండి ప్రారంభం అయ్యే టోర్నీ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles