New zealand crush india by 87 runs win series 4 0

MS Dhoni, Virat Kohli, New Zealand, Brendon McCullum, Kane Williamson, New Zealand, Ross Taylor, Dhoni,cricket, One-day cricket

Indian cricket team slumped to its worst ODI series defeat in New Zealand, going down 0—4

సిరీస్ పోయింది - పరువు పోయింది

Posted: 01/31/2014 07:54 PM IST
New zealand crush india by 87 runs win series 4 0

మొన్నటి వరకు ప్రపంచ నెంబర్ వన్ జట్టు. కానీ విదేశాల్లో వరుస పరాజయాలతో నెంబర్ హోదాను కోల్పోవడమే కాకుండా, విదేశాల్లో విజయాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతాయనే పేరును సంపాదించుకోవడమే కాకుండా చెత్త ప్రదర్శనతో పరువును కాస్త గంగలో కలిపింది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో ఒక్క విజయాన్ని కూడా అందుకోలేక చతికల పడింది.  ఐదో వన్డేలో భారత్ 87 పరుగులతో కివీస్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది.

బ్యాట్స్ మెన్స్ , బౌలర్లు సమిష్టిగా విఫలం అయ్యారు. చివరి వన్డేలో చెలరేగి ఆడిన కివీస్  పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శించి 4-0తో సిరీస్ సొంతం చేసుకుంది. 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన మరో రెండు బంతులు మిగులుండగా 216 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (82), ధోనీ (47) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. 

టాస్ గెలిచిన ఇండియా కివీస్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. టీమిండియాకు 304 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కివీస్ను విలియమ్సన్, రాస్ టేలర్ ఆదుకున్నారు. టేలర్(102) సెంచరీ, విలియమ్సన్(88) అర్థ సెంచరీ సాధించారు. భారత బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి తలో వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles