India beats australia by six wickets in twenty20

Yuvraj Singh, MS Dhoni take India to 6-wicket win, MS Dhoni, Yuvraj Singh, Yuvraj Singh stars in comeback, India beats Australia

Yuvraj Singh has returned to the world cricket stage in the grandest of fashion, steering India to a six-wicket victory over Australia.

యువీ విధ్వంసం...టి20 ఇండియాకే

Posted: 10/17/2013 07:02 PM IST
India beats australia by six wickets in twenty20

గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్ కి ఫామ్ లేని కారణంగా దూరంగా ఉన్న యువరాజ్ చాలా రోజుల తరువాత ఇచ్చిన రీ ఎంట్రీలో అదరగొట్టాడు. నిన్నరాత్రి రాజ్ కోట్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టి20లో సూపర్ ఫామ్ తో అద్బుతమైన ఆటతీరుతో, అంతులేని ఆత్మ విశ్వాసంతో చెలరేగి ఆడిన యువరాజ్ (35 బంతుల్లో 77 నాటౌట్ 8 ఫోర్లు; 5 సిక్స్ లు)  చాలా రోజుల తరువాత మళ్ళీ ప్రేక్షకులకు అసలైన టి20 మ్యాచ్ రుచి చూపించాడు. యువరాజ్ వింధ్యంసంతో ఆసీస్ ఓటమి తప్పలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (52 బంతుల్లో 89; 14 ఫోర్లు; 1 సిక్స్), నిక్ మ్యాడిన్సన్ (16 బంతుల్లో 34; 6 ఫోర్లు; 1 సిక్స్) జోరుతో 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (13 బంతుల్లో 27; 4 సిక్స్) చివర్లో రెచ్చిపోయాడు .

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు మంచి ఆరంభమే లభించింది. ధామన్ (32), రైనా (19) కోహ్లీ (29) కొద్ది సేపు స్కోరు బోర్డును పరుగులెత్తించి అవుట్ అయ్యారు. 12 ఓవర్ల వరకు 102 పరుగులు చేసిన టీం ఇండియా విజయం అందుకోవడం కష్టమే అనుకున్నారు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన యువీ తన బ్యాట్‌ను ఝుళిపించాడు , ఆసీస్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. యువీ, ధోని రాకతో ఆట స్వరూపమే మారింది. యువరాజ్ కి తోడుగా ధనాధన్ ధోని కూడా రెచ్చిపోవడంతో భారీ లక్ష్యం మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్  యువీకి దక్కింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles