Nadal wins ninth french open title

Nadal wins ninth French open title, Rafel nadal, French Open tennis, novak djokovic,

Rafael Nadal French Open by defeating Novak Djokovic to win a ninth title at Roland Garros.

మట్టి కోర్టులో ఎదురు లేదని నిరూపించాడు

Posted: 06/09/2014 11:29 AM IST
Nadal wins ninth french open title

ఎర్ర మట్టి పై మరోసారి స్పెయిల్ బుల్ రంకెలేసింది. ప్రత్యర్థి ఎవరైనా ఎర్ర కోర్టులో టైటిల్ నాదే అని మరోసారి నిరూపించుకోవడమే కాకుండా, 14 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు తన ఖాతాలో వేసుకొని టెన్నిస్ స్టార్ సంప్రాస్ సరసన చేరాడు. ఈ విజయంతో ఇన్నాళ్లు పదిలంగా కాపాడుకుంటున్న ప్రపంచ మొదటి ర్యాంకును మరింత పదిలంగా ఉండేలా చేసుకున్నాడు. రోలండ్ గారోస్‌లోని క్లే కోర్టును తన సొంత అడ్డాగా మార్చుకున్న రాఫెల్ నాదల్ మరోసారి ఆ గడ్డపై తన దూకుడు ప్రదర్శించాడు.

తనకు అచ్చొచ్చిన చోట వరుసగా ఐదో ఫ్రెంచ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రికార్డు విజయంతో చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మరోవైపు ప్రస్తుత ఫామ్‌తో అద్భుతాన్ని ఆశించిన ‘జోకర్’ నొవాక్ జొకోవిచ్‌కు మళ్లీ  ‘ఫ్రెంచ్ ఓపెన్ ’ అందని ద్రాక్షే  అయింది. ఆదివారం రోలండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాదల్ 3-6, 7-5, 6-2, 6-4తో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై ఘన విజయం సాధించాడు.

తొలి సెట్ నెగ్గి జొకోవిచ్ కాస్త ఆధిక్యం ప్రదర్శించినట్లు కనిపించినా... 3 గంటల 31 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో చివరకు నాదల్‌దే పైచేయి అయింది. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాదల్ గెలవడం ఇది 9వ సారి కాగా... వరుసగా ఐదో సారి (2010-2014) కావడం విశేషం. ఈ విజయంతో టెన్నిస్ చరిత్రలో వరుసగా పదో ఏడాది ఏదో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రీడాకారుడిగా నాదల్ చరిత్ర సృష్టించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles