Sania mirza doubles lost rozer cup

sania mirza latest news, sania mirza crying, sania news, sania mirza doubles game, sania mirza cara black, sania mirza rozer cup, sania mirza news

sania mirza doubles lost rozer cup : Indian tennis player sania mirza with cara black lost the rozer game in doubles cup

తెలంగాణ పరువు తీసేసిన కేసీఆర్ అంబాసిడర్

Posted: 08/12/2014 06:40 PM IST
Sania mirza doubles lost rozer cup

(Image source from: sania mirza doubles lost rozer cup)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్రానికి అంబాసిడర్ గా నియమిస్తే.. సానియా మాత్రం వారి ఆశలు మీద నీళ్లు చల్లేసింది. వారు ఊహించిన దానికి విరుద్ధంగా సానియా ప్రవర్తన మారిపోయినట్లు కనిపిస్తోంది.

ఇటీవలే కాలంలో సానియా మీర్జా మీద ఎన్నోరకాల వార్తలు పుకార్లు చేసుకుంటూ వార్తల్లో భలే తిరిగాయి. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన నేపథ్యంలో ఆమె మీద వచ్చిన విమర్శలను స్పందిస్తూ.. నేను కూడా భారతీయురాలినేనంటూ కన్నీరు పెట్టుకుని మరీ తెలిపింది. దీంతో ఈ అమ్మడికి ఎంతోమందికి మద్దతుగా పలికారు. సానియామీర్జాను నెత్తిన పెట్టుకుని మరీ అందరూ ఆమెకు సలహాదారులుగా నిలిచారు. ఇండియాకు గొప్ప పేరును తీసుకొచ్చింది సానియా మీర్జానే.. అటువంటి మహిళను అవమానించడం అంటూ ఆమె తరఫున గళం ఎత్తారు. దీంతో ఫుల్ జోష్ లోకి వచ్చిన సానియా మీర్జా.. ఈసారి జరిగే మ్యాచ్ లో భారత్ కు అరుదైన గౌరవాన్ని తీసుకొస్తుందని భావించిన తరుణంలో.. మరోసారి నిరాశే మిగిల్చింది.

రోజర్స్ కప్ విజయంతో యూఎస్ ఓపెన్ కు గ్రాండ్ గా సన్నద్ధమవుదామనుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈసారి మళ్లీ నిరాశే మిగిలింది. ఈ కప్ లోజింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్ తో కలిసి.. డబుల్స్ ఫైనల్ చేరిన సానియా చివరకు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగో స్పీడ్ గా పోటీపడ్డ సానియా - కారా జంట టైటిల్ పోరులో 6-7, 3-6తో ఓడిపోయింది. ప్రపంచ నెంబర్ వన్, ఇటలీకి చెందిన టాప్ సీడ్ సారా ఎరాని - రోబర్టా విన్సీ ఇద్దరూ ఈ డబుల్స్ లో అద్భుత విజయాన్ని సాధించి.. సానియాను ఇంటిదారి పట్టించారు. తొలిసెట్ లో అద్భుతంగా ప్రదర్శించి టై బ్రేక్ దాకా తీసుకెళ్లిన సానియా జంట.. రెండో సెట్ లో మాత్రం వారి ధాటికి పోరాడలేక చేతులెత్తేసింది.

ఇదిలావుండగా.. సానియా మీర్జా ఈవిధంగా ఘోర పరాజయం కావడం నేపథ్యంలో కొంతమంది విశ్లేషకులు.. ‘‘కేసీఆర్ ఏరికోరి మరీ తమ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా సానియాను ఎన్నుకుంటే.. ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోయి ఆ రాష్ట్ర పరువును నిట్టనిలువునా ముంచేసిందని చెప్పుకుంటున్నారు. అయితే ఆట అన్నాకా జయాలు, అపజయాలు మామూలేనని చివరికీ సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza news  rozer cup  sania mirza doubles  sania mirza rozer cup  

Other Articles