Maria sharapova kiss reaches french open semi finals

Maria Sharapova kiss, Sharapova kiss reaches, Sharapova kiss reaches French Open semi-finals, Sharapova Russia, Maria Sharapova beats

Maria Sharapova kiss reaches French Open semi-finals, Maria Sharapova Russia

ముద్దు స్పీడ్ సెమీస్‌ వరకు వెళ్లింది...

Posted: 06/04/2014 11:27 AM IST
Maria sharapova kiss reaches french open semi finals

ఒక చేతిలో టెన్నిస్ బ్యాట్.. మరో చేతితో ముద్దుతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యాకు చెందిన మాజీ చాంపియన్ మరియా షరపోవా మరోసారి సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నమెంట్‌లో ఏడోసీడ్‌గా బరిలోకి దిగిన షరపోవా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో స్పెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజాను ఓడించింది.

మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తొలి సెట్‌ను 1-6 తేడాతో చేజార్చుకున్న షరపోవా ఆ తర్వాత విజృంభించి పవర్‌ఫుల్ షాట్లతో అభిమానులను అలరించింది. ఫలితంగా షరపోవా 7-5, 6-1 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని ముగురుజాను మట్టికరిపించింది.

Sharapova-semi-final

2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న షరపోవా గత ఏడాది ఫైనల్‌లో అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్న విషయం విదితమే. సెమీస్‌లో షరపోవా కెనడాకు చెందిన 18వ సీడ్ క్రీడాకారిణి యుగెనీ బౌచర్డ్‌తో తలపడనుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles