వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరగనున్న టెస్టు మ్యాచ్ తరువాత సచిన్ క్రికిట్ కి పూర్తిగా వీడ్కోలు పలకబోతున్న విషయం తెలిసిందే. తన సొంత మైదానంలో చివరి టెస్టు ఆడటం గొప్ప అనుభూతిగా సచిన్ ఫీలయితే... అదే సొంత మైదానంలో చివరి టెస్టులో బౌలర్ చివరి సారిగా ఈయన్ను అవుట్ చేస్తే... ఇంకెంతో గొప్ప అనుభూతిగా ఫీలవుతాడు. W
ఇప్పుడు ఇలానే ఫీలవుతున్నారు విండీస్ క్రికెటర్లు. టెస్టు సిరీస్ ఆడటానికి మన దేశానికి చేరుకున్న తరువాత ఆ జట్టు కెప్టెన్ సామీ మాట్లాడుతూ... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చివరి టెస్టులో ప్రత్యర్థులుగా ఆడటం తమకు గర్వకారణంగా ఉందని, అయితే అతడిని తొలి బంతికే అవుట్ చేయాలనే కోరిక కూడా ఉందని, మాస్టర్‌ను అవుట్ చేయాలని మా జట్టులో ప్రతి బౌలర్ తహతహలాడుతున్నారని, ఈ టెస్టు సిరీస్ గెలవడానికి శాయశక్తుల కష్టపడతామని సామీ తెలిపాడు.
సచిన్ ఎంతోమందితో పాటు తనకు కూడా హీరోనే అని చెప్పాడు. సచిన్ పలకరిస్తేనే పొంగిపోతారని, కనిపించిన ప్రతి ఒక్కరినీ గుడ్‌మార్నింగ్ అంటూ విష్ చేసే గొప్ప వ్యక్తని మాస్టర్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. 2011లో సచిన్ వందో సెంచరీ కోసం అందరూ ఎదురుచూస్తున్న సమయంలో వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ ఇచ్చిన క్యాచ్‌ను స్యామీ అందుకుని యావత్ భారతదేశాన్ని నిరాశపరిన సంగతి గుర్తుండే ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more