గుత్తా జ్వాలా కోర్టు కెక్కింది. అక్కడ తేల్చుకుంటానని ఢిల్లీకి వెళ్లింది. తన పై జీవితకాల నిషేధాన్ని విధిస్తూ (భాయ్ ) క్రమశిక్షణ సంఘం చేసిన సిఫార్సును వ్యతిరేకిస్తూ ఆమె ఢిల్లీ కోర్టు మెట్లు ఎక్కింది. క్రమ శిక్షణ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బాయ్ పై పిటీషన్ ధాఖలు చేసినట్లు ఆమె తండ్రి అయిన బ్యాడ్మింటన్ ప్లేయర్ తండ్రి క్రాంతి గుత్తా వెల్లడించారు. ఈ పిటిషన్ పరిశీలించిన జస్టిస్ వీకే జైన్ నేడు విచారణ జరపనున్నారు. ఈమె పై క్రమ శిక్షణ చర్యలు తీసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసిన బాయ్ నెల రోజుల పాటు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించడంతో వాటన్నింటిని కొట్టివేయాలని జ్వాలా ఆ పిటీషన్ లో కోరింది. భాయ్ ఆదేశాలు న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉన్నాయని, నా వాదన వినకుండానే నాపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని అంది. మరోవైపు జ్వాల కోరితే ఈ వివాదాన్ని తాము పరిశీలిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. గుత్తా పిటీషన్ పై కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more