గత సంవత్సరాల నుండి క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు తెర దించుతూ సంచలనాత్మకమైన ప్రకటన చేశాడు. గత రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తూ, ప్రపంచ రికార్డుల్ని సొంతం చేసుకొని కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఇప్పటికే టి20, వన్డేలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక టెస్టులకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు నేడు ప్రకటించాడు. త్వరలో మన దేశంలో విండీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ తరువాత క్రికెట్ కి దూరంగా ఉంటానని చెప్పాడు.
త్వరలో తాను ఆడబోయే చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం వైదొలగనున్నాడు. గతంలోనే సచిన్ విండీస్ సిరీస్ తరువాత తప్పుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ వచ్చిన సచిన్ సడెన్ గా ఈ నిర్ణయాన్ని వెల్లడించడంతో అందరు షాక్ కి గురయ్యారు. . సచిన్ రిటైర్మెంట్ తో అంతర్జాతీయ క్రికెట్లో ఓ శకం ముగియనుంది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మన్ మాజీ గా మారబోతున్నాడు. తన కెరీర్ను పూర్తిగా ఆస్వాదించానని సంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ మేరకు బీసీసీఐ లేఖ రాశాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సచిన్ తాను భారత్ తరుపున క్రికెట్ ఆడటం తన జీవిత కాల స్వప్నం అని, కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి రోజు ఒకే కలతో బతుకుతున్నానని, 11 ఏళ్ళ వయస్సు నుండి క్రికెట్ ఆడుతున్నానని, ఇప్పుడు క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుకోలేనని సచిన్ అన్నాడు. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,837 పరుగులు సాధించిన ఈయన 51 శతకాలు, 67 అర్థ శతకాలు సాధించాడు. వన్డేల్లో అత్యథికంగా 198 పరుగులు చేసి రికార్డు స్రుష్టించాడు. 200 వ టెస్టులో చివరిసారిగా కనిపించనున్న సచిన్ లేని క్రికెట్ ని ఊహించుకోవడం కాస్త కష్టమేనేమో ?
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more