జార్ఖండ్ డైనమేట్ ధోని తన సొంత మైదానం రాంచీలో జరిగిన సీఎల్ టి20లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలగేరి అక్కడి అభిమానులకు చిరస్థాయిగా గుర్తుండే ఇన్నింగ్స్ ఆడి అలరించాడు. గడ్డపై గత మ్యాచ్‌లో విఫలమైన ధోని, ఈ సారి ఫ్యాన్స్‌ను నిరాశ పర్చలేదు. అతి తక్కువ బంతుల్లో (16) అర్థ సెంచరీ (50) పరుగులు చేసి అంత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ సాధించిన ధోని జట్టుకు మరో భారీ విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఆరంభంలో అంత వేగంగా ఆడకపోయినా సురేష్ రైనా తనదైన శైలిలో రాణిస్తూ జట్టు స్కోరును మెల్లిగా పెంచాడు. 17 ఓవర్ల వరకు 141 పరుగులే చేసిన ఆ జట్టు చివరి 3 ఓవర్లలో 61 పరుగులు చేసి 202 మార్కును చేరింది. 19వ ఓవర్లో పెరీరా వేసిన 8 బంతుల్లో 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. బంతి బౌండరీలు దాటుతుంటే ప్రేక్షకులు కేరింతలు కొడుతుంటే హైదరాబాద్ ఆటగాళ్ళు ప్రేక్షకుల్లా నిల్చుండి పోయారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగిన సన్ రైజర్స్ తొలి వికెట్‌కు 56 బంతుల్లో 87 పరుగులు జోడించి ధావన్ (34 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), పార్థివ్ (28 బంతుల్లో 37; 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. అయితే నాలుగు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు డుమిని (0) కూడా అవుట్ కావడంతో రైజర్స్ ఇన్నింగ్స్ పట్టు తప్పింది. చివర్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సిక్సర్లతో డారెన్ స్యామీ (25 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా రైజర్స్ విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది..
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more