ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా రెండు దేశాలు ఎంతో ప్రతిష్టాత్మంగా భావించే యాషెష్ సిరీస్ ను వరుసగా మూడోసారి ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ఎంతో రసవత్తరంగా సాగిన ఐదవ టెస్టు డ్రాగా ముగియడంతో ఇంగ్లాండ్ మూడు టెస్టులతో సిరీస్ ని నిలబెట్టుకుంది. ఈ సిరీస్ లో ఘోరంగా విఫలం అయిన క్లార్క్ సేన ఇంగ్లాండ్ ను నిలువరించలేక పోయింది. చివరి టెస్టునైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో 226 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉండగానే క్లార్క్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ల్ చేశాడు. కానీ క్లార్క్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వకపోగా ఓదశలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ చెలరేగడంతో స్వల్ప పరుగుల తేడాతోనే టెస్టు డ్రాగా ముగిసింది. అంతకుముందు 247/4 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటయ్యింది. ఇయాన్ బెల్ (143 బంతుల్లో 45; 5 ఫోర్లు), ప్రియర్ (57 బంతుల్లో 47; 8 ఫోర్లు) రాణించారు. రెండో ఇన్నింగ్స్ న్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను ఆరంభంలోనే ఇంగ్లండ్ బౌలర్లు వణికించారు. వికెట్లు త్వరగా పడిపోతుండడంతో 23 ఓవర్లలో 6 వికెట్లకు 111 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. క్లార్క్ (28 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ వీలైనంత త్వరగా ఇంగ్లండ్ వికెట్లను తీద్దామనుకున్నప్పటికీ ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ అంత సులువుగా లొంగలేదు. కెవిన్ పీటర్సన్ (55 బంతుల్లో 62; 10 ఫోర్లు)తో రాణించడంతో కుక్ సేన 40 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే వెలుతురు సరిగా లేదని అంపైర్లు ఆటను నిలిపివేశారు. దీంతో చివరి టెస్టు డ్రాగా ముగిసింది
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more