ఈ టోర్నీతో ఛాంపియన్స్ ట్రోఫికి మంగళం పాడనున్నారు. మినీ వరల్డ్ కప్ గా భావించే ఈ టోర్నీ చివరిది కావడంతో ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో భారత్ జోరు కొనసాగిస్తుంది. ఇంగ్లాండ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొడుతుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఘన విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ చేరినా, మరో వైపు దాయాదులతో జరిగే పోరును రసవత్తరంగా లేకుండా చేసింది. నిన్నరాత్రి వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ఘన విజయం సాధించింది.
మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని, విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. భారత బౌలర్ రవీంద్ర జడేజా ధాటికి (5-33) ధాటికి విండీస్ చేతులెత్తేసింది. చార్లెస్ (60), డారెన్ సామీ (56 నాటౌట్), డారెన్ బ్రావో (35) రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. తరువాత అతి కష్టం కాని ఈ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన భారత్, ఓపెనర్లు రోహిత్ శర్మ (52), శిఖర్ ధవన్ (107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 102 నాటౌట్) శతక్కొట్టడంతో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే విండీస్ పై విజయాన్ని సొంతం చేసుకుంది. కెరియర్లో బెస్ట్ బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో గ్రూప్ టాపర్‌గా భారత్ (4) సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇదే గ్రూప్‌లోని పాక్ రెండు వరుస పరాజయాలతో ఇప్పటికే రేసు నుంచి వైదొలగగా, మరో బెర్తు కోసం దక్షిణాఫ్రికా (2), విండీస్ (2) పోటీపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more