ఒలంపిక్స్ లో భారత్ కి బ్యాడ్మింటన్ లో పథకం సాధించి పెట్టి భారత కీర్తిని నలుమూలల చాటిన తెలుగు తేజం అయిన సైనా నెహ్వాల్ కి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి పిలిచి మరీ అవమానించారు. ఈమె కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ముంబై, చెన్నై మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు స్టార్ స్పోర్ట్స్ వారి ఆహ్వానం మేరకు హాజరైంది. ఈమె అక్కడ ప్రత్యక్షం కావడంతో అభిమానులు సంతోషపడిపోయారు. ఇక మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రధాన కార్యక్రమ వేదిక వద్దకు చేరుకున్న సైనా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఈమె చేతుల ద్వారా అందించాలని భావించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవిశాస్త్రి... పొలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైనా అందజేస్తుందని కూడా చెప్పారు. కానీ ఏమైయిందో ఏమో కానీ మరో వ్యక్తి పొలార్డ్‌కు అవార్డు ఇచ్చారు. దాంతో రవిశాస్త్రి కూడా వెంటనే అతని పేరు పలికాడు. దీంతో సైనా ఒక్కసారిగా బిత్తరపోయింది. అయితే ఆమె అభిమానులు మాత్రం సైనాను అంత దూరం పిలిచి క్రికెట్ వాళ్ళు అవమానించారిని అంటున్నారు. ఇది ఒకరంగా సైనాకు అవమానమనే చెప్పాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more