ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో మరి. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో ఎప్పుడు ఏ అద్భుతం జరగుతుందో చెప్పలేం. అదే నిన్న చెన్నై, ముంబయి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఈ సీజన్ లోనే అంత్యంత పటిష్టమైన జట్టుగా పేరొందడమే కాకుండా, వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ జట్టుకు ముంబై ఎక్స్ ప్రెస్ జట్టుకు బ్రేకులు వేసింది. నిన్న ముంబయిలోని తన సొంత స్టేడియం వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో చెన్నైని చిత్తుగా ఓడించింది. ఈ ఐపీఎల్ లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి ఘోర పరజయాన్ని మూటకట్టుకొంది. నిన్నటి మ్యాచ్ లో ముంబయి బౌలర్ల ముందు ధోని ఎత్తుగడలు ఏమీ పనిచేయలేదు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసింది. ఆట ప్రారంభంలో పరుగులు చేయడానికి తడబడిన ముంబయి జట్టు చివర్లో దూకుడుగా ఆడి ఆ మాత్రం స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 30 బంతుల్లో 39 పరుగులు నమోదు చేయగా.. ఓపెనర్ స్మిత్ 22, దినేష్ కార్తిక్ 23, హర్భజన్‌సింగ్ 25 పరుగులు చేశారు.
ఇన్నింగ్స్ ముగిసిన సమయంలో చెన్నై జట్టుకు ఈ లక్ష్యం పెద్ద మేటర్ కాదనుకున్నారంతా. దీన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై జట్టు ముంబయి బౌలర్ల ధాటికి విలవిలలాడి పోయారు. జ్ఞాన్ ఓజా (3/11), మిచ్చెల్ జాన్సన్ (3/27) చెరో మూడు వికెట్లు పంచుకొని చెన్నై బ్యాటింగ్‌ను చిన్నాబిన్నం చేయగా.. వారికి సహకరించిన లసిత్ మలింగా మూడు ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకొని చెన్నై ఇన్నింగ్స్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో 79 పరుగలకే చాప చుట్టేసింది. ఐపీఎల్ మొత్తంలో చెన్నై జట్టుకు ఇదే అత్యల్ప స్కొరు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more