టైటిల్ ఫేవరెట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కి పూణె వారియర్న్ అనుకోని షాక్ ఇచ్చింది. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న పుణె చెన్నైని నిలువరించడం కష్టమే అనుకున్నారంత. కానీ శ్రీలంక క్రికెటర్లకు చెన్నైలో అనుమతి లేకపోవడంతో ఆ స్థానంలో వచ్చిన ఫించ్ ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకోవడమే కాకుండా మంచి స్కోరును అందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పూణే వారియర్స్ కి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పుణె ఓపెనర్లు ఫించ్ (67; 45 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప (26; 33 బంతుల్లో 2 ఫోర్లు) సూపర్ పర్‌ఫామెన్స్‌కు మరో బ్యాట్స్‌మన్ స్మిత్ (39) కూడా తోడవ్వడంతో వడివడిగా పరుగులు చేసిన పుణె సూపర్ కింగ్స్ ముందు 160 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
తరువాత భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన చెన్నై బ్యాట్స్ మెన్స్ ని పుణె బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ అనిరుధ (0) వికెట్‌ను కోల్పోయిన చెన్నై మరో కొద్ది సేపటికే రైనా (8) వికెట్‌ను కోల్పోయింది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న ఓపెనర్ మురళీ విజయ్ (24)తో కలిసి బ్యాటింగ్ చేసిన బద్రినాథ్ (34) నికలడగా బ్యాటింగ్ చేయగా.. అనంతరం జడేజా (27) కూడా పరవాలేదనిపించాడు. ఈ క్రమంలో ఓ ఝలకిచ్చిన మార్ష్ బద్రినాథ్ , జడేజాలను పెవీలియన్‌కు చేర్చి చెన్నై దెబ్బతీశాడు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ ఈ సారి 10 పరుగులకే పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మోర్కెల్ (13) కొంత ప్రతిఘటించినప్పటికీ సహచరుల సహకారం లభించలేదు. అప్పటికే దాదాపుగా మ్యాచ్‌పై పట్టు కోల్పోయిన చెన్నైని మరింత కట్టడి చేసిన పుణె వారియర్స్ బౌలర్లు 20 ఓవర్లలో 8 వికెట్ల పడగొట్టి 135 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో విజయానికి మరో 24 పరుగుల దూరంలో ఇన్నింగ్స్ ముగియడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more