Hockey player soundarya

hockey player soundarya, soundarya yendala, indian womens hockey team

hockey player soundarya

soundarya.gif

Posted: 03/08/2013 07:17 PM IST
Hockey player soundarya

hockey player soundarya

 గ్రామీణ నేపథ్యం... వ్యవసాయ కుటుంబం... ఎంచుకున్న కెరీర్‌లో ఆర్థిక ప్రోత్సాహం అంతంతే... అయితే ఇవేవీ ఆ అమ్మాయికి అడ్డుకాలేదు. ఆటపై ఉన్న ఆసక్తితో పట్టుదలగా శ్రమించి భారత జట్టు తరఫున అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది. ఐదేళ్ల నుంచి జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది. తనలాంటి ఎందరో క్రీడాకారిణులకు స్ఫూర్తినిచ్చే ఈ విజయగాథ 23 ఏళ్ల యెండల సౌందర్యది. నిజామాబాద్‌కు చెందిన సౌందర్య ప్రస్తుతం భారత మహిళల హాకీ జట్టులో రెగ్యులర్ ప్లేయర్. ఎలాంటి ఘనమైన నేపథ్యం, ఎవరి అండదండలు లేకున్నా కేవలం స్వశక్తితో ఆమె ఈ స్థాయికి చేరుకోవడం విశేషం.

నిజామాబాద్‌కు చెందిన సౌందర్య పాఠశాల స్థాయిలోనే హాకీపై ఆసక్తి ప్రదర్శించింది. తమ స్కూల్‌కు చెందిన అనేక మంది స్థానిక గ్రౌండ్‌లో హాకీని ఆడటం చూసి ఆటపై ఇష్టం పెంచుకుంది. అయితే పురుషుల హాకీకే పెద్దగా గుర్తింపు లేదు. అందులోనూ మన రాష్ట్రంలో హాకీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దశలో ఒక అమ్మాయి ఈ క్రీడాంశాన్ని ఎంచుకోవడం సాహసమే. కానీ సౌందర్య పట్టుదల కనబర్చింది. వ్యాయామ ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయడంతో తన ఆటను మెరుగుపర్చుకుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిల్లో వివిధ టోర్నీలలో పాల్గొని తన సత్తా చాటింది. హైదరాబాద్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్‌లో ప్రవేశం లభించడం సౌందర్య కెరీర్‌ను మార్చేసింది.

భారత జట్టులో స్థానం...

సాయ్అకాడమీలో శిక్షణ పొందుతూ జూనియర్ స్థాయి పోటీల్లో పాల్గొన్న సౌందర్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఫలితంగా భారత్ అండర్-18 జట్టులో తొలిసారి అవకాశం దక్కింది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే సీనియర్ టీమ్‌లోకి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎంపికైంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ ఆమె తొలి టోర్నీ. అనంతరం భారత జట్టులో ఫార్వర్డ్ స్థానంలో నిలకడగా రాణిస్తూ తన చోటు పదిలం చేసుకుంది. మధ్యలో ఒకసారి చేతి గాయంతో జట్టుకు దూరమైనా... జట్టులో ఆమె ఎప్పుడూ స్థానం కోల్పోలేదు. భారత జట్టు సభ్యురాలిగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, హాలెండ్, అర్జెంటీనా తదితర దేశాల్లో జరిగిన టోర్నీలలో పాల్గొని సత్తా చాటింది. ఇప్పటి వరకు 24 టోర్నమెంట్‌లలో కలిపి 86 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె ప్రదర్శనకు గత ఏడాది మరింత గుర్తింపు దక్కింది. డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆరు టెస్టుల సిరీస్‌లో సౌందర్య జట్టు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం ఈమె సెంట్రల్ రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తోంది.

నా నేపథ్యం, ప్రాంతం కారణంగా ఈ ఆట సరిపోదు అని చాలా మంది ఆరంభంలో నిరాశపరిచారు. అయితే ఆటపై ఉన్న ఇష్టంతో ఆడాను. చాలా కష్టాలు పడ్డాను కూడా. మొదలు పెట్టినప్పుడు పెద్ద లక్ష్యాలేవీ పెట్టుకోకపోయినా అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకున్నాను. హాకీలో నేను సాధించిన ఘనత పట్ల సంతృప్తిగా ఉంది. అమ్మాయిలు ఎవరైనా తమకు ఆసక్తి ఉన్న రంగాన్నే ఎంచుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gautam gambhir to interact with fans on womens day
Sehwag says he is not contemplating retirement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more