భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పైకి సాదాసీదాగా కనిపించినా అతని లోపల ప్రత్యర్థిని 'పరుగులు' పెట్టించే పులి దాగుంటుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఆడడం మొదలు పెట్టినప్పటి నుంచి తానీ విషయం గమనిస్తున్నానని హేడెన్ చెప్పాడు. సచిన్‌పై విమల్ కుమార్ రాసిన 'సచిన్... క్రికెటర్ ఆఫ్ ద కంట్రీ' అనే పుస్తకంలో హేడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. '90వ దశకం ఆరంభంలో నేను తొలిసారిగా సచిన్ పేరు విన్నాను. సచిన్‌ను దగ్గర్నుంచి చూసినప్పుడు అతని పర్సనాలిటీకి, ఇమేజ్‌కి పోలికే లేదే అనిపించింది. అతనిపై ఆడినపుడుగానీ ఆ లిటిల్ మ్యాన్‌లోపల పులి దాగుందని నాకు తెలీలేదు' అని ఆ పుస్తకంలో హేడెన్ పేర్కొన్నాడు. మాస్టర్ ఘ నతను చాటే ఓ సంఘటనను హేడెన్ గుర్తుచేశాడు. 'సచిన్ గొ ప్పదనాన్ని నేను దగ్గర్నుంచి చూసి ఆస్వాదించిన సందర్భం ఒకటుంది. 2008లో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఆ వెంటనే బాణసంచా పేలుళ్ల కార ణంగా 20 నిమిషాలపాటు ఆట నిలిచిపోయింది. ఆ సందర్భం నా కెరీర్‌లో మరువలేనిద'ని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more