తొలి టెస్టులో భారత్ కు విజయాన్నందించిన డబుల్ సెంచరీని తనకే అంకితమిచ్చుకున్నాడు భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఈ ఇన్నింగ్స్ ను ఎవరికి అంకితమిస్తారని మ్యాచ్ అనంతరం విలేకరులు ప్రశ్నిస్తే .. దీన్ని నాకోసం ఉంచుకుంటా అంటూ చమత్కరించాడతను. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ఇన్నింగ్సా అంటే చెప్పలేను. చాలా భారీ ఇన్నింగ్స్ లేమీ ఆడలేదు. కాబట్టి ఏదో ఒకటి ఎంచుకోవడం సులభమే. ఐతే 2007లో లార్డ్స్ టెస్టులో చేసిన 70 పరుగులు చాలా ప్రత్యేకమైనవి. ఎన్ని పరుగులు చేశామన్నది ముఖ్యం కాదు. ఇన్నింగ్స్ విలువ ముఖ్యం. ఇన్నాళ్లుగా నేను చేస్తున్న ఉత్తమమైన పనేంటంటే.. వార్తలు చూడకపోవడం, పత్రికలు చూడకపోవడం, అలాగని నేను పత్రికలు చదవనని కాదు. కానీ క్రీడా పేజీతోనే సమస్య. దానికి మాత్రం దూరంగా ఉండాలని అంటున్నారు ధోని. అయితే భారత్ భారీ స్కోరు చేసిందంటే.. అది 3,4, 5, స్థానాల్లో బ్యాటింగ్ చేసినవారి ఘనత, సచిన్ సెంచరీ చేయలేదు, పుజరా అర్థశతకం సాధించలేదు. కానీ నిర్ణయాత్మకంగా బ్యాటింగ్ చేశారు. చెన్నైలో ఉక్కపోత ఆసీస్ బౌలర్లను బాగా అలసిపోయేలా చేసింది. మొత్తంగా బ్యాట్స్ మెన్ , బౌలర్లు సమష్టిగా శ్రమించారు. అశ్విన్ తిరిగి నిలకడ సాధించడం చాలా సంతోషాన్నిచ్చింది. అయితే నేను క్రీజులోకి వచ్చేసరికి మ్యాచ్ సమతూకంతో ఉంది. ఉద్దేశపూర్వకంగా భారీ షాట్లు ఆడి, నాకు సమీపంలో ఉన్న అదనపు ఫీల్డర్ దూరంగా వెళ్లిపోయోలా చేశా. దీని వల్ల ప్లెటెడ్ డెలివరీలను ఎదుర్కొనేటప్పుడు క్యాచ్ లు లేచినా ప్రమాదం లేకపోయింది. ఇంతకుముందు ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాణ్ని. ఇప్పుడు ఆరుకు మారాను. బ్యాటింగ్ లో జడేజా నిలదొక్కుకుని, ఆ స్థానాన్ని అందుకునే వరకు నేను ఆరో స్థానంలోనే ఆడతా.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more