కలిసొచ్చే కాలం ఉంటే... నడిసొచ్చే కొడుకు పుడతాడు అనే సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత భారత షట్లర్ సైనా నెహ్వాల్ కి అతికినట్లు సరిపోయింది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో తొలి రెండు మ్యాచ్ లో పరాజయం పాలై, చావో రేవో తేల్చుకొని, ఇంకో క్రీడాకారిణి విజయం పై ఆధారపడ్డ సైనా నెహ్వాల్ కి అంతా కలిసి వచ్చింది. గ్రూప్ ‘బి ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సైనా 21-7, 21-18తో రెండో సీడ్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో వరల్డ్ జూనియర్ మాజీ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) 21-15, 21-14తో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ టిన్ బౌన్ (డెన్మార్క్)ను ఓడించింది. దాంతో రత్చనోక్ వరుసగా మూడో విజయంతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. ఒక్కో విజయం సాధించిన సైనా, టిన్ బౌన్, షెంక్ ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. దాంతో మెరుగైన గేమ్‌ల ఆధారంగా ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన సైనాకు సెమీఫైనల్ స్థానం దక్కింది. దీంతో సైనా ఇవాళ వరల్డ్ నెంబర్ వన్ తో సెమీ ఫైనల్లో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more