మనవాళ్ళ ఆట ఏంటో మరోసారి తేలిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన నాగ్ పూర్ టెస్టులో బౌలింగ్ బాగానే చేశారు కానీ, బ్యాటింగ్ లో మళ్ళీ విఫలం అయి, పీకల్లోతు కష్టాల్లోకి పడిపోయారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి, నాలుగవ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కష్టాల్లో పడింది. ఓ దశలో 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సెహ్వగ్, సచిన్ లు మరోసారి అభిమానులను నిరాశపరిచారు. తొలి ఓవర్ లోనే పరుగులేమి చేయకుండానే సెహ్వగ్ అవుట్ కాగా, సచిన్ రెండు పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్ లో అవుటై పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం కోహ్లీ 10, కెప్టెన్ ధోని 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అండర్సన్ రాణించి గంభీర్, సెహ్వగ్, సచిన్ లను అవుట్ చేశాడు. స్వాన్ కు పుజారా వికెట్ దక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 330 పరుగులకు ఆలౌట్ అయింది. మనవాళ్ళు కనుక రేపు క్రీజ్ లో నిలబడక పోతే.... ఈ టెస్టు కూడా ఇంగ్లాండ్ వశమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more