సిగ్గు లేదా.. ఆడదానివి అయి ఉండి బూతు సినిమా తీస్తావా? | CBFC Members Insult Lady Producer

Cbfc orders 48 cuts for babumoshai bandookbaaz

Babumoshai Bandookbaaz, Babumoshai Bandookbaaz Controversy, Babumoshai Bandookbaaz CBFC, Udta Punjab Babumoshai Bandookbaaz, Udta Punjab Lipstick Under My Burkha Babumoshai Bandookbaaz, CBFC Cuts Nawazuddin Siddiqui Movie, Censor Board versus Bollywood, Babumoshai Bandookbaaz Release, Babumoshai Bandookbaaz Issue, Babumoshai Bandookbaaz Intimate Scenes, Babumoshai Bandookbaaz A Certificate, Kushan Nandy, Kiran Shyam Shroff CBFC Insult, Censor Board Insult Woman Producer, Babumoshai Bandookbaaz Lady Producer

Babumoshai Bandookbaaz get 48 cuts after getting A Certificate. Makers Plan to go for Revise Committee. CBFC members insult producer Kiran Shroff, question how a woman can make such a film

బాబు మషాయ్ బందూక్ బాజ్ సెన్సార్ కష్టాలు.. నిర్మాతకు అవమానం!

Posted: 08/02/2017 11:56 AM IST
Cbfc orders 48 cuts for babumoshai bandookbaaz

బాలీవుడ్ లో ఇప్పుడు సెన్సార్ బోర్డు కట్ లు మరో కాంట్రవర్సీకి తెరలేపాయి. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన బాబుమషాయ్ బాంధూక్ బాజ్ కు సంబంధించి బోర్డు ఎడాపెడా 48 కట్ లు చెప్పేసింది. దీంతో చిత్ర నిర్మాతలు రీవైజ్ కమిటీకి దరఖాస్తు చేస్తున్నారు. దీనిపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రహ్లాద్ నిహ్లానీ మీడియా ప్రశ్నించగా, అభ్యంతరకర సన్నివేశాలు చాలా వున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతూ, తన పని తాను చేశాను అంతే అంటూ సింపుల్ గా సమాధానమిచ్చాడు.

అదే సమయంలో నిర్మాత కిరణ్ ష్రాఫ్ ను సెన్సార్ బోర్డు సభ్యులు ఘోరంగా అవమానించినట్లు తెలుస్తోంది. ‘‘సర్టిఫికెట్ కోసం వెళ్లిన సమయంలో నన్ను లోపలికి పిలిచి ఓ గంట మాట్లాడారు. ఓ మహిళ అయి ఉండి ఇంత దారుణమైన చిత్రాన్ని ఎలా నిర్మించావంటూ ఓ సభ్యుడు ప్రశ్నించాడు. అంతలోనే మరో సభ్యుడు కలగజేసుకుని ఆమె మహిళని ఎవరన్నారు? చూడండి. ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకుందో అంటూ కామెంట్ చేశాడు.. దీంతో తనకు ఏం మాట్లాడాలో తెలియక బయటకు వచ్చేశాను అని కిరణ్ మీడియా ముందు వాపోయింది. చిత్ర దర్శకుడు కుషన్ నందీ మాట్లాడుతూ.. చిత్రానికి ముందు ఏ సర్టిఫికెట్ ఇచ్చేశాక, 48 కట్ లు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు.

ట్రైలర్ లాంఛ్ లో అవమానం

గతంలో ఉడ్తా పంజాబ్ విషయంలోనూ చైర్మన్ ప్రహ్లాద్ ఇదే రీతిలో వ్యవహరించటం, ఆపై కోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేయటంతో సినిమా సజావుగా రిలీజ్ కావటం తెలిసిందే. ఈ మధ్యే లిప్ స్టిక్ అండర్ మై బుర్ఛా విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ కాగా, ఎట్టకేలకు సినిమా ఎలాగోలా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు బాబూ మషాయ్ కు కూడా ఈ కష్టాలు తప్పటం లేదు. ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు టూమచ్ గా ఉన్నాయంటూ నటి చిత్రాంగద సింగ్ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోగా, ఆ ప్లేస్ లో బదితా బాగ్ ను తీసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేసే ఫ్లాన్ లో నిర్మాతలు ఉన్నారు.

 

ఉడ్తా పంజాబ్ లొల్లి ఏందసలు?

 

అడల్ట్ కంటెంట్ మరీ ఎక్కువైందా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babumoshai Bandookbaaz  Nawazuddin Siddiqui  CBFC Cuts  

Other Articles