కాంగ్రెస్, ఆప్ ఆశలపై స్టార్ డైరెక్టర్ నీళ్లు | Anurag snubs congress and AAP tries to grab Udta Punjab

Anurag snubs congress and aap tries to grab udta punjab

Anurag, Anurag Kashyap, Anurag Kashyap Udta Punjab, congress Udta Punjab, AAP Udta Punjab, తెలుగువార్తలు, తాజా వార్తలు, ఉడ్తా పంజాబ్, కాంగ్రెస్ ఆప్ ఉడ్తా పంజాబ్, అనురాగ్ కశ్యప్ ఉడ్తా పంజాబ్, ఉడ్తా పంజాబ్ రాజకీయాలు, latest news, political news, politics, telugu news

Anurag snubs congress and AAP tries to grab Udta Punjab. says don't make it political issue as i am alone fight aginast board.

కాంగ్రెస్, ఆప్ ఆశలపై స్టార్ డైరెక్టర్ నీళ్లు

Posted: 06/08/2016 03:56 PM IST
Anurag snubs congress and aap tries to grab udta punjab

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు మన రాజకీయ నాయకులకు వాడుకోవటానికి ప్రతీ టాపిక్ ముఖ్యమే. టీవీల్లో ప్రసారమయ్యే యాడ్ ల దగ్గరి నుంచి యూనివర్సిటీ చావుల దాకా ప్రతీది వారికి ఆయుధమే. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉండరు. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’ ఇప్పుడు వారికి ఆయుధంగా మారింది. షాహిద్, అలియాభట్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో డ్రగ్స్ మాఫియాతో తెరకెక్కిన ఈ చిత్రంలో పంజాబ్ సమకాలీన పరిస్థితులతోపాటు దానికి రాజకీయాల మద్ధతు ఎలా ఉండబోతుందనేది చూపించబోతున్నారట. తొలుత బ్యాన్ చేస్తారనే టాక్ వచ్చినప్పటికీ ఆపై సెన్సార్ క్లియరెన్స్ కోసం బోర్డు ముప్పుతిప్పలు పెట్టిందని తెలుస్తోంది.

చిత్రంలో పంజాబ్ ను చెడుగా చిత్రీకరించారని, బూతులు ఎక్కువగా వాడటం, డ్రగ్స్ వినియోగం అతిగా చూపించారని.. ఇంకా ఏవేవో కారణాలు చెప్పి సెన్సార్ వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే లేవనెత్తేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఉడ్తా పంజాబ్’ టీంకు మద్దతుగా కాంగ్రెస్ తోపాటు ఆమ్ ఆద్మీ కదిలింది. అయితే సినిమా పేరుతో రాజకీయాలు చేస్కుంటున్న వారికి పెద్ద షాకే ఇచ్చాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు.

‘ఉడ్తా పంజాబ్’ నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ విషయమై ట్విట్టర్లో స్పందించాడు. ఈ వివాదంలో తమకు ఎవరి మద్దతూ అవసరం లేదని.. సోషల్ మీడియాలో ఓ పార్టీ పెయిడ్ ట్వీట్లతో ఈ కాంట్రవర్శీని మరింత పెద్దది చేయాలని ప్రయత్నిస్తోందని.. తనను యాంటీ ఎన్డీఏ ఏజెంట్ గానూ చిత్రీకరించే ప్రయత్నమూ జరుగుతోందని అతనన్నాడు. అంతేకాక తాను ఎన్డీయే ప్రభుత్వంలో కంటే యూపీఏలో సెన్సార్ సమస్యలు మరింత ఎక్కువగా ఎదుర్కొన్నానంటూ కాంగ్రెస్ వాళ్ల గాలి తీసేశాడు . కాకపోతే ఇప్పుడు సెన్సార్ బోర్డును ఓ నియంత నడిపిస్తున్నాడంటూ ప్రహ్లాద్ నిహలానిని ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ఈ విషయంలో తాను ఒంటరిగా పోరాడతానని కశ్యప్ స్పష్టం చేశాడు. మోదీని ఇరుకున పెట్టడానికి దీన్నో అవకాశంగా ఉపయోగించుకుని ఇష్యూను మరింత పెద్దది చేయాలనుకున్న ప్రయత్నాలకు భారీగానే గండపడినట్లయ్యింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anurag Kashyap  Anurag Kashyap Udta Punjab  congress Udta Punjab  AAP Udta Punjab  

Other Articles