ప్రత్యేకం కోసం బీజేపీ పొత్తు వదులుకోవడానికి సిద్ధం | chandrababu says ready for break up with BJP over AP special status

Chandrababu says ready for break up with bjp over ap special status

chandra babu break up with BJP, TDP break up BJP for Special Status, chandrababu angry on Arun Jaietly, babu angry on MPs over status bill discussion

AP CM chandrababu says ready for break up with BJP over AP special status.

బీజేపీని బాబు అంత మాట అన్నాడా?

Posted: 07/30/2016 10:46 AM IST
Chandrababu says ready for break up with bjp over ap special status

కేంద్రంలోకి అధికారం దక్కించుకున్న ఆనందం బీజేపీకి లేకుండా చేస్తున్నాయి మిత్రపక్షాలు. ఓవైపు మహారాష్ట్రలో శివసేన, మరోవైపు ప్రత్యేక హోదాపై తెలుగుదేశం చెడుగుడు ఆడేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు దాదాపుగా మైత్రిని తెంచేసుకునే తరుణం దగ్గర్లోనే ఉందని రాజకీయ నిపుణల వాదన. మహా రాజకీయాలు పక్కనబెడితే తాజాగా ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా చంద్రబాబు ఎంపీలతో చేసిన వ్యాఖ్యలు టీడీపీ-బీజేపీ పొత్తు ఎంతో కాలం కొనసాగకపోవచ్చనే భావించవచ్చు.

బిల్లుపై చర్చకు ముందుగానే సాధ్యమైనంత వరకు పోరాడాలని, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సభలో కూలంకషంగా వివరించాలని, అవసరమైతే కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలంటూ హిత బోధ చేసిన చంద్రబాబు ఈరోజు ఎంపీలకు మరోసారి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్ లో చర్చను సానుకూలంగా మలుచుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇంకోవైపు బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ మొండి చేయి చూపిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అవసరమైతే పొత్తును తెగదెంచుకోవాలని వారితో వ్యాఖ్యానించారంట. ‘‘ఏపీకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వాటి విషయంలో కేంద్రం వైఖరి దారుణంగా ఉంది. దీనిపై మనం పోరాడాల్సిందే. వెనుకాడాల్సిన అవసరమే లేదు. పొమ్మంటే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేద్దాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడేది లేదు, రాజీనామాలకు సిద్ధంగా ఉండండి’’ అంటూ చంద్రబాబు వారితో చెప్పినట్లు తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాల విషయంలో బీజేపీ సర్కారు ఇలాగే వ్యవహరిస్తే ఆ పార్టీతో పొత్తును రద్దు చేసుకునేందుకు కూడా వెనుకాడేది లేదన్న రీతిలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు ప్రత్యేక హోదా బిల్లుపై జరిగిన చర్చ గురించి ఆయన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉండటంతో, అందులో ఆయన ఏం మాట్లాడబోతున్నారనే విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  special status  chandra babu naidu  BJP  break-up  

Other Articles