Police | Muncipal staff | Charminar, | Clean | Hyderabad

Police refused to municipal staff ay charminar

Police, Muncipal staff, Charminar, Clean, Hyderabad

Police refused to municipal staff ay Charminar. Mucnipal employees at chaminar stop the police to remove detritus.

పోలీస్ లకే షాక్.. వాళ్లనే అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది

Posted: 07/13/2015 08:59 AM IST
Police refused to municipal staff ay charminar

ఏ ధర్నా జరిగినా, ఏ ఆందోళన జరిగినా అక్కడ ప్రత్యక్ష్యమయ్యేది పోలీసులు. ఆందోళనకారులను అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్ లకు తరలిస్తారు. అయితే టైం బ్యాడ్ అయితే మాత్రం పోలీసులకూ చుక్కలు కనబడతాయి. పోలీసులు చేస్తున్న పనులను ఎవరైనా అడ్డుకుంటే ఎలా ఉంటుంది..? పోలీసుల పనికి అడ్డుతలగలమే కాకుండా వారిని నిలదీస్తే ఎలా ఉంటుంది.? అవును అచ్చంగా ఇలానే జరిగింది. హైదరాబాద్ లో అది కూడా చార్మినార్ వద్ద చోటుచేసుకున్న ఘటన ఇది. గత కొన్నిరోజులగా సాగుతున్న మునిసిపల్ ఉద్యోగుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతలా చర్చిస్తున్నా కానీ చర్చలు సఫలం కావడం లేదు.

Also Read: కామాంద ఖాకీకి కటకటాలు.. సిసిటీవీకి చిక్కిన అత్యాచారంపర్వం..

తాజాగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు చార్మినార్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను చూసి తట్టుకోలేకపోయారు. అందుకూ మునిసిపాలిటీ వారు ఎలాగూ చెయ్యడం లేదు కదా అని ఓ చెయ్యవేసి చెత్తను తీసివేద్దామని ముందుకు వచ్చారు.  దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, అడిషనల్‌ డీసీపీ బాబురావుతోపాటు ఏసీపీలు అశోక్‌చక్రవర్తి ఆధ్వర్యంలో పోలీసులు, స్థానికులు  తొలగించడానికి పూనుకున్నారు. అంతకు ముందు. డీసీపీ వి.సత్యనారాయణ తొలుత పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి చెత్తను శుభ్రం చేయాలని కోరారు. అయితే, కార్మికులు నిరాకరించి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో 30 మంది కార్మికులపై చార్మినార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు స్వయంగా చెత్తను తీసే పనిలో పడ్డా వారిని అడ్డుకుని.. చెత్తను తీసివెయ్యడానికి వీలులేదంటూ నినదించారు.

Also Read:  బాలకృష్ణను అడ్డుకున్న పోలీసులు..? మహానాడులో బాలకృష్ణకు పరాభావమా?

అయినా ప్రతీసారి ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అని వార్త చూసీచూసీ జనాలకు కూడా విసుగు పుట్టింది కావచ్చు. తాజాగా చార్మినార్ దగ్గర పోలీసులు చెత్తను తీసివేస్తుంటే మున్సిపల్ కార్మికులు అడ్డుకోవడం కొంచెం కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది. అయితే తమ సమస్యలను తీర్చాలని మునిసిపల్ ఉద్యోగులు వారం రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సానుకూల నిర్నయాలు తీసుకోవడం లేదు. అయితే ఇప్పటికే ప్రైవేట్ కార్మికులు ఎవరైనా వచ్చి చెత్తను తీసివెయ్యడానికి ప్రయత్నిస్తే మాత్రం ఏకంగా కొట్టి తరిమేశారు మునిసిపల్ సిబ్బంది. తాజాగా పోలీసులకు కూడా వీరి కాక తగలడం విశేషం.

తండ్రీ కొడుకుల నిర్వాకం వల్లే తెలంగాణలోని మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు దిగాల్సి వచ్చిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. పురపాలక శాఖను కేసీఆర్‌ తన వద్దే ఉంచుకుని, పంచాయతీరాజ్‌ శాఖను కేటీఆర్‌కు ఇచ్చారని, తండ్రీకొడుకులు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.

By Abhinavachary

Also Read:  నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Muncipal staff  Charminar  Clean  Hyderabad  

Other Articles