KCR | Muncipal strike | Hyderabad | Naayini Narasimhareddy | Somesh kumar

Muncipal employees strike troubles people

KCR, Muncipal strike, Hyderabad, Naayini Narasimhareddy, Somesh kumar

Muncipal employees strike getting troubles to people. In Telangana six corporations and all muncipalities employees on the strike.

కేసీఆర్ కు కంపు కొట్టడం లేదా..? సమ్మెపై తేలదే..!

Posted: 07/15/2015 08:32 AM IST
Muncipal employees strike troubles people

తమ డిమాండ్లను సాథించుకోవడానికి మునిసిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెతో హైదరాబాద్ తో పాటు పలు నగరాలు కంపుకొడుతున్నాయి. రోడ్ల మీద, వీధుల్లో, ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలుకుప్పలుగా పేరుకుపోయింది. పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కార్మికులు సమ్మె కొనసాగించేందుకే మొగ్గుచూపటంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. సమ్మెపై త్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే మంగళవారం నుంచి పారిశుద్ధ్య పనుల్లో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను, ఇతర విభాగాల ఉద్యోగులను భాగస్వాములను చేయాలని కూడా సూచించారు.

Also Read: కేసీఆర్ తాట తీసిన మున్సిపల్ మహిళా వర్కర్

కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నామని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరింది. అయితే, కనీస వేతనాలు పెంచుతున్నట్లు లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని కార్మికుల సంఘాలు స్పష్టంచేశాయి. సమ్మెపై అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో రాజధాని సహా రాష్ట్రంలోని పట్టణాలు కంపుకొడుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లు, 27 నగర పంచాయతీలు, 35 మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సమస్య కలవరపెడుతున్నది. వీధులు, బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు.. ఇలా ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.

Also Read:  హైదరాబాద్ లో కంపు కొట్టును.. ముక్కులు అదురును

సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్తృతం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 500 మంది కొత్త కార్మికులను నియమించినట్లు అధికారులు తెలిపారు. కానీ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎక్కడా చెత్త క్లీన్ కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్య సమాఖ్య నాయకులు ప్రకటించారు.  మున్సిపల్ కార్మికులు గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. వెంటనే స్పందించి కార్మికుల జీతం నెలకు రూ.14,070కి పెంచుతున్నట్లు లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే సమ్మె విరమిస్తామని వారు స్పష్టం చేశారు.

By Abhinavachary

Also Read:  మున్సిపల్ కార్మికుల సమ్మె ఉదృతం.. ఎక్కడి చెత్త అక్కడే
Also Read: పోలీస్ లకే షాక్.. వాళ్లనే అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Muncipal strike  Hyderabad  Naayini Narasimhareddy  Somesh kumar  

Other Articles