Sania Mirza Turned As Rickshawala For Her Partner Hingis In China | Wuhan Open Title | Sania Mirza rickshaw

Sania mirza turned rickshawala for partner hingis in china wuhan open title

sania mirza news, sania mirza rickshaw, sania mirza hingis news, sania mirza run rickshaw, sania mirza wuhan title, sania mirza latest updates, sania mirza social media

Sania Mirza Turned Rickshawala For Partner Hingis In China Wuhan Open Title : Sania Mirza Turned As Rickshawala For Her Partner Hingis In China After Winning Wuhan Open Title.

రిక్షావాలాగా అవతారమెత్తిన సానియా మీర్జా

Posted: 10/05/2015 11:33 AM IST
Sania mirza turned rickshawala for partner hingis in china wuhan open title

అవును.. టెన్నిస్ మైదానంలో తన బ్యాటుతో ప్రత్యర్థిని కట్టడి చేసే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు రిక్షావాలాగా అవతారమెత్తింది. ప్రస్తుతం టెన్నిస్ మ్యాచుల నేపథ్యంలో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడికి ఆ పరిస్థితి వచ్చింది. ఓవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు కెరీర్ సాఫీగా సాగుతుండటంతోపాటు షోయబ్ మాలిక్ లాంటి బర్త వున్నప్పటికీ.. సానియాకు రిక్షావాలాగా అవతారమెత్తక తప్పలేదు. ఆమె రిక్షా తొక్కుతున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఆమె నిజంగా రిక్షావాలాగా మారలేదులెండి.. విదేశంలో వున్న ఈమె తన సహచరితో కలిసి సరదాగా గడిపిన సందర్భంగా.. ఆమె రిక్షా తొక్కుతున్న వైనాన్ని కెమెరాకి ఎక్కించి.. ఫోస్ బుక్ లో పోస్ట్ చేసంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది.

చైనా ఓపెన్ కోసం సానియా మీర్జా బీజింగ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. మహిళా డబుల్స్ కేటగిరి విభాగంలో ఈమెతోపాటు మార్టినా హంగిస్ కూడా అక్కడే వుంది. వీరిద్దరూ అక్కడి మ్యాచులు వరుసగా గెలుస్తూ.. ఖాళీ సమయాల్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హింగిస్ ను రిక్షాలో ఎక్కించుకుని తాను రిక్షా తొక్కుతున్నట్టు ఓ ఫోటో తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆరోజు హింగిస్ కు ‘డే ఆఫ్’ అయితే తనకు మాత్రం ‘వర్కింగ్ డే’ అంటూ ఆమె సదరు పోస్ట్ కు సరదా కామెంట్ జోడించింది. ఇదిలావుండగా.. ఇటీవల చైనాలో జరిగిన వుహాన్ ఓపెన్‌ టైటిల్ను ఈ జోడీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా.. తన స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్ తో కలసి ఈ విజయాన్ని సాధించింది. ఈ జోడీ రుమేనియాకు చెందిన ఇరీనా కామెలియా బెగూ - మోనికా నికెలెస్కూ జోడీపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza rickshaw  sania mirza hingis  

Other Articles