Has Rafael Nadal given up on equalling Roger Federer's 17 Grand Slams record?

Rafael nadal unsure to add to his grand slam tally

Tennis, Rafael Nadal, Roger FedererAustralian Open, US Open, Andy Murray, French Open, Wimbledon, Web Exclusive, Sky Sports, Nadal No.7 in world rankings

Is it the end of the road for one of the best tennis players of the generation and fourteen-time Grand Slam winner Rafael Nadal?

రఫా క్రీడా అద్యాయం ముగిసిపోయిందా..?

Posted: 09/29/2015 06:40 PM IST
Rafael nadal unsure to add to his grand slam tally

టెన్నీస్ లో సంచలనాలకు తెరతీసి.. ఔరా అనిపించిన ఆటగాడు.. అనుమానాలకు, సందేహాలకు తావిస్తున్నాడు. దీంతో తన కెరీర్ ముగిసిపోయినట్లేనా అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. సుమారు 14 ఏళ్ల తరువాత కోమా నుంచి తేరుకున్న ఓ అభిమాని తన అభిమాన టెన్నీస్ క్రీడాకారుడు ఇంకా ప్రపంచ టెన్నీస్ టార్నమెంట్లలో చక్కగా రాణిస్తున్నడని తెలుసుకుని సంబరపడ్డాడు. అలాంటి అభిమానులకు సందేహాలు కలగజేస్తూ.. ఆయన టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతకీ ఆ టెన్నీస్ ఆటగాడు ఎవరు అంటారా..? ఆయనే స్పెయిన్‌ బుల్‌ రఫెల్ నడాల్.

మరో టెన్నిస్ క్రీడాకారుడి రోజర్ ఫెదరర్ మాదిరిగా 17 గ్రాండ్ స్లామ్ లు సాధించాలన్న పట్టుదల కానీ, ఆయన రికార్డును తిరగరాయాలన్న లక్ష్యం కానీ ఆయనలో ఇప్పుడు కనిపించడం లేదు. కెరీర్‌లో 14 సార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలిచిన రఫెల్‌ నడాల్‌.. భవిష్యత్‌లో మరో మేజర్‌ టైటిల్‌ గెలుస్తానో లేదో చెప్పలేననే అనుమానం వ్యక్తం చేశాడు. గాయాల కారణంగా ఇటీవల ఫామ్‌ కోల్పోయిన రఫా 2015లో ఒక్క గ్రాండ్‌స్లామ్‌ కూడా నెగ్గకుండానే ఈ సీజన్‌ను ముగించాడు. దీంతో అతడు ఏడో ర్యాంకుకు పడిపోయాడు. తాను మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గుతానో లేదో చెప్పలేనన్నారు. మరోసారి చాంపియన్‌గా నిలుస్తానో లేదో తెలియదన్నారు. కానీ, సాధించగలనన్న నమ్మకం మాత్రం తనకుందన్నారు. వచ్చే రెండేళ్లలో వీలైనన్ని ఎక్కువ అవకాశాలు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నానని రఫా తెలిపాడు. 100 శాతం ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి పూర్వ వైభవం సాధిస్తానని తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tennis  Rafael Nadal  Australian Open  US Open  Andy Murray  French Open  Wimbledon  

Other Articles