Sania Mirza may be nominated for Khel Ratna by sports ministry

Tennis star sania mirza may be nominated for khel ratna

Sania Mirza may be nominated for Khel Ratna by sports ministry, tennis star sania mirza may be nominated for khel ratna, Sania Mirza, Sania Mirza Khel Ratna, Khel Ratna award, Sania Mirza for Khel Ratna award sports ministry, Vikas Gowda, Sardar Singh, Sania Mirza, Rajiv Gandhi Khel Ratna, Martina Hingis

Sania Mirza's Wimbledon doubles conquest with partner Martina Hingis last week, the sports ministry has plans to recommend the 28-year-old tennis star for the Rajiv Gandhi Khel Ratna, the country's highest sporting honour.

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారినిక సానియా పేరు..?

Posted: 07/19/2015 02:37 PM IST
Tennis star sania mirza may be nominated for khel ratna

హైదరాబాద్ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు దేశంలోని క్రీడాకారులకు లభించే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నా పురస్కారానికి ఎంపిక చేయనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి.  ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళా డబుల్స్ టైటిల్ ను సాధించి.. దేశ ప్రతిష్టను నలుదిశలా వ్యాపింపజేసిన సానియాకు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందించాలని క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలిసింది.

కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సానియా ఇటీవలే మార్టినా హింగిస్ తో జతకట్టి వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసింది. గత కోంత కాలంగా సానియా మహిళా డబుల్స్ క్రీడాకారిణిల జాబితాలో కూడా నెంబర్ వన్ స్తానంతో టాప్ ప్లేస్ లో నిలుస్తూవస్తుంది. వివిధ వేదికలపై సాధించన విజయాలతో సానియా పేరుప్రతిష్టలు ఇనుమడించాయి. కాగా ఖేల్ రత్నకు సానియా వ్యక్తిగతంగా దరఖాస్తు చేయసుకోనప్పటికీ.. అమెకు ఈ అత్యున్నత పురస్కారం అందించాలని క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఓ క్రీడాకారుడికి ప్రతిష్మాత్మక రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందుకునే అర్హత ుందని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తే తప్ప.. సదరు శాఖ స్వయంగా కేంద్రానికి పురస్కారానికి ఈ పేరును పరిశీలించాలని పిఫార్సు చేయదు. అయితే సానియా మిర్జా విషయంలో ఇలా చోరవ తీసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. ఈ ఏడాది అమె సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకుని అమె పేరును అత్యున్నత పురష్కారానికి సిపార్సు చేసింది. 2004 లో అర్జున అవార్డును, 2006లో పద్మశ్రీ అవార్డును సానియా మిర్జా అందుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikas Gowda  Sardar Singh  Sania Mirza  Rajiv Gandhi Khel Ratna  Martina Hingis  

Other Articles