Saniamirza | World | Tennis | Record

Sania mirza got the world no 1 position in the individual doubles ranking

saniamirza, tennis, india, world, ranking, hingisis, no1, family circle cup, sania mirza updates

Sania Mirza made history in the picturesque American harbour city of Charleston becoming the first Indian woman to claim the world No. 1 position in the individual doubles ranking.The big-hitting 28-year-old, who altered her schedule to chase the top-spot in the WTA rankings, was all smiles following the emotional triumph.

హాట్సాఫ్.. వరల్డ్ నెంబర్ వన్ గా సానియా మీర్జా

Posted: 04/13/2015 03:24 PM IST
Sania mirza got the world no 1 position in the individual doubles ranking

డబుల్స్‌లో సానియాకు నంబర్ వన్ ర్యాంకు దక్కింది. ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర హింగిస్‌తో కలిసి సానియా ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం  చేసుకుంది. సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో మకుటం లేని మహారాణిగా నిలిచింది. ఎంతో కాలంగా  ఊరిస్తున్న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుని తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జత కట్టి మొన్న ఇండియన్ వెల్స్, నిన్న మియామీ ఓపెన్, ఇప్పుడు ఫ్యామిలీ సర్కిల్ కప్‌లనుసొంతం చేసుకుని డబుల్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ ఘనత వహించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

తన ఆటతీరు బాగాలేదన్న విమర్శకులకు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుతో సానియా ఘాటైన సమాధానమిచ్చింది. కెరీర్ ముగిసిపోయిందనుకున్న దశ నుంచి ఇంతటి అద్భుత విజయాలు సాధించడం సాధారణమైన విషయం కాదు. 2007లో అత్యుత్తమంగా సింగిల్స్‌లో 27వ ర్యాంకును అందుకున్న సానియా ఆ తర్వాత ఏకంగా 217వ ర్యాంకుకు పడిపోయింది. ఆ తర్వాత గాయంతో ఫామ్ కోల్పోయింది. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా నాలుగు శస్త్రచికిత్సలు చేయించుకుంది. దీంతో సానియా ఇక రాకెట్ పట్టడం కష్టమేనన్న కామెంట్లు. ఈ దశలో సానియాకు కోచింగ్ ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకురాలేదు. అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా మళ్లీ రాకెట్‌పట్టింది. సింగిల్స్‌లో రాణించడం కష్టమనుకుంది. డబుల్స్‌పైనే ఏకాగ్రతపెట్టింది. 2013లో అమెరికా ప్లేయర్ బెతానీ మాటెక్‌తో కలిసి దుబాయ్ టైటిల్ విజయంతో మొదలైన సానియా ప్రస్థానం ఏకంగా గ్రాండ్‌స్లామ్ సాధించేదాకా సాగింది. కొన్ని నెలల క్రితం సానియా డబుల్స్‌లో ఐదోర్యాంకు అందుకుంది. ఆ తర్వాత ఉమ్మడిగా టాప్‌ర్యాంకును అందుకుంది.

గతేడాది ఆసియా క్రీడల్ని వద్దనుకుని డబ్ల్యూటీఏ టోర్నీలకే పరిమితమై ఉంటే ఆమె ర్యాంకు ఎనిమిదో ర్యాంకుకు పడిపోయేదే కాదు. కానీ, దేశానికి ఆడడమే ప్రధానమనుకున్న సానియా ఆ మెగా ఈవెంట్‌లో సాకేత్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించి తన జాతీయతను ప్రశ్నించిన వాళ్ల నోళ్లు మూయించింది. 2009లో మహేశ్ భూపతి జతగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకున్న సానియా, 2012లో భూపతితోనే కలిసి ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గింది. ఇక గతేడాది బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోరెస్ జోడీగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. వింబుల్డన్ కూడా నెగ్గితే డబుల్స్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన అరుదైన ఘనతను సానియా సొంతం చేసుకుంటుంది.

"నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం ప్రతీ ఒక్కరి కల. ఈ ఘనత సాధించడంలో హింగిస్ నుంచి లభించిన సహకారం మరొకరి నుంచి వస్తుందని అనుకోను. ఇక్కడికి వచ్చాక నా దృష్టంతా నం.1 పైనే పెట్టాను. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో హింగిస్ అందించిన తోడ్పా టు మరువలేనిది. ఈ విజయంతో నం.1 జోడీగానూ అవతరించాం. మరిన్ని విజయాలు సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నాం. ముందు నుండి సపోర్ట్ చేసిన తన పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్, కోచ్ లకు ధ్యాంక్స్, దేవుడి ఆశిర్వాదాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ  సానియా మీర్జా తన ఫీలింగ్స్ ను ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saniamirza  tennis  india  world  ranking  hingisis  no1  family circle cup  sania mirza updates  

Other Articles