Sania Mirza-Martina Hingis breeze into Miami Open doubles final

Sania hingis enter miami open doubles semis

Sania Mirza, Martina Hingis, Miami Open women’s doubles final, Timea Babos, Kristina Mladenovic, Ekaterina Makarova, Elena Vesnina, BNP Paribas Open, Andrea Hlavackova, Lucie Hradecka

Sania Mirza and Martina Hingis are in line to win their second title in a row as they breezed into the final of the Miami Open women’s doubles with a straight sets win over Timea Babos and Kristina Mladenovic.

మియామీ ఫైనల్స్ లోకి సానియా-హీంగీస్ జోడి

Posted: 04/04/2015 04:01 PM IST
Sania hingis enter miami open doubles semis

భారత టెన్నీస్ దిగ్గజం సానియా మిర్జా.. స్విట్జర్లాండ్ కు చెందిన మార్టినా హింగిస్ జోడి రెండో టైటిల్ ను చేజిక్కించుకునేందుకు ముందుకు దూసుకెళ్తున్నారు. మియామీ ఓపెన్ డబుల్స్ టైటిల్ పోటీలో సానియా హింగిస్ జోడి ఫైనల్ కు చేరారు. సెమీ ఫైనల్స్ లో బాబోస్- లదనోవిచ్ జోడిపై విజయం 6-2, 6-4 తో విజయం సాధించారు. ఫైనల్ లో ఈ జోడి మకరోవా- లెనా వెన్సీనా జోడితో వీరిద్దరూ తలపడనున్నారు. కాగా ఈ జోడీని ఇటీవల జరిగిన బిఎన్ పి పరిబాస్ ఓపెన్ లో రెండు వారాల క్రితం సానియా హింగీస్ జోడి ఓడించింది.

ఇదే విషయాన్ని సానియా మిర్జాను అడుగగా, గత వారం క్రితం వారిపై గెలుపొందడానికి అమలపర్చిన విధానాలనే అమలు పరుస్తామని చెప్పారు. ఆటపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి, ప్రతీ పాయింట్ కోసం పోడాడుతామని, ఇదే విధానాన్ని తాము గత బి ఎన్ పీ  పరిబాస్ ఓపెన్ లోనూ అమలు పర్చామని చెప్పారు. పేర్లను మ్యాచ్ లను గెలువలేవని, వాటితో గెలుపోటములు కూడా రావని అబిప్రాయపడ్డారు. ప్రతీ రోజు ఓ కోత్త గేమ్ వుంటుందని, దీంతో ప్రత్యర్థులను అంచానా వేయడం మాని, ఎవరినైనా ధీటుగా ఎదుర్కోని బదులిస్తామని సానియా మీర్జా చెప్పారు. అయితే ఫైనల్ ప్రత్యర్థి జోడి ఛాంపియన్లని, తామ జోడి ఇప్పుడిప్పుడే జతకట్టిందని, ఎలా ఆడాలో నేర్చుకుంటున్నామని చెప్పారు. ఈ దశలో ఛాంఫియన్లతో తలపడటం కూడా మందిదేనని సానియా మిర్జా చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis Miami Open women’s doubles  

Other Articles