Health and Beauty benefits can get with Amla | Different Types Of Healthy food items

Amla health beauty skin benefits health disease heart problems eye sight

Amla health benefits, Amla beauty benefits, Amla health tips, Amla healthy ingradients, Amla fruits, Amla juice, Amla fruit beauty product, healthy foods, healthy food items, beauty products

Amla Health Beauty Skin Benefits Health disease Heart problems eye sight : We can get lots of healthy and beauty benefits with Amla Fruit. It cures diabetic, protects from heart disease and many other health problems. It also increases the glow of skin and cure some skin problems.

ఉసిరి తినండి.. నిత్యయవ్వనంగా వుండండి!

Posted: 04/29/2015 03:12 PM IST
Amla health beauty skin benefits health disease heart problems eye sight

ప్రకృతిలో సహజంగా లభించే కొన్ని పదార్థాల్లో మానవ శరీరానికి అవసరమయ్యే పోషకాలు నిల్వవుంటాయని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించిన విషయం విదితమే! అటువంటి వాటిలో ఉసిరికాయ కూడా ఒకటి! ఇది ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేయడంతోపాటు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్యా నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇందులో ఎన్నోరకాల పోషకాలు, ఖనిజాలు నిల్వవుంటాయని.. ముఖ్యంగా చర్మసౌందర్యానికి కావలసిన ఔషధగుణాలు మరెన్నో వుంటాయని వారు పేర్కొంటున్నారు. మరి.. ఉసిరిలో వుండే పోషకాలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది శరీరానికి కావలసినంత ఎనర్జీని అందించడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా రోజంతా హుషారుగా అన్ని కార్యకలాపాల్లోనూ పాల్గొనవచ్చు. కాబట్టి.. ఉసిరిని ఎంత ఎక్కువగా తింటే అంతే ఆరోగ్యానికి మంచిది. నీరసంగా వున్న సమయంలో ఎనర్జీ లెవెల్స్ ను పెంచుకోవాలంటే ఉసిరి తింటే చాలు.

* ఈ ఉసిరికాయలను మధుమేహగ్రస్థులు తరచూ తీసుకుంటే.. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందడంతోపాటు నిత్యయవ్వనులుగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇందులో మధుమేహ వ్యాధిని నిరోధించే పోషక విలువలు ఎన్నో నిల్వవుంటాయి. అలాగే.. చర్మరక్షణకు కావలసిన ఇతర ఖనిజాలు కూడా వుంటాయి.

* ఉసిరికాయలో క్యాల్షియం, ఐరన్ వంటి ధాతువులు ఎంతో పుష్కలంగా వుంటాయి. ఇవి జుట్టును నెరసిపోకుండా చేయడంలో తమవంతు పాత్రను పోషిస్తాయి. కేశ సంరక్షణలో ఉసిరికాయ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పుడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కాయ జుట్టుకు బలాన్నివ్వడమే కాకుండా హెయిర్ ఫాల్‌ను చాలా వరకు తగ్గిస్తుంది కూడా!
 
* ఇక ఆరోగ్యపరంగా చూస్తే.. ఈ ఉసిరికాయ హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తినిచ్చే ఉసిరి.. గుండెపోటును నియంత్రిస్తుంది. అలాగే.. కంటి దృష్టి లోపాలను నయం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యల్ని నయం చేస్తుంది. వయస్సు మీద పడినా ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా యంగ్‌గా కనిపిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amla Healthy Benefits  Amla Beauty benefits  Amla Health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more