Sweet Corn Health Benefits | Health Tips

Sweet corn health benefits contains nutrients

sweet corn health benefits, sweet corn tips, sweet corn health tips, health tips, health benefits with sweet corn, eye sight problems, sugar problems

sweet corn health benefits contains nutrients : The Health benefits from sweet corns which contains vitamins, anti accidents, minerals and many more nutrients.

స్వీట్‌కార్న్‌లో దాగివున్న ఆరోగ్య ఔషధాలు

Posted: 03/24/2015 06:31 PM IST
Sweet corn health benefits contains nutrients

సాధారణంగా ప్రకృతిలో లభించే కొన్ని ఆహారాల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నై ఔషధగుణాలు దాగి వుంటాయి. వివిధరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషక విలువలు దాగి వుంటాయి కాబట్టి.. రెగ్యులర్ డైట్ లో వాటితో తయారుచేయబడ్డ ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సలహాలు ఇస్తారు. అలాగే.. వీటిపై పరిశోధనలు జరిపిన శాస్త్రజ్ఞులు.. ఏ పండ్లలో ఎంతమేర పోషకాలు నిల్వవవున్నాయనే అంశంపై పరిశోధనలు చేసి మరీ అందుకు సంబంధించి సూచనలు కూడా ఇస్తున్నారు. కాబట్టి.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా మెలగవచ్చు.

అటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాల్లో స్వీట్ కార్న్ కూడా ఒకటి! ఇందులో మానవ శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు నిల్వవున్నాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ బి, సీలతోపాటు మెగ్నీషియమ్, పొటాషియం వంటి ఖనిజాలున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే.. పసుపురంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో నిల్వవుంటాయి. ఇవి.. కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. అంటే.. కంటిచూపును మెరుగుపర్చడం, ఇతర ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించేలా అవి పనిచేస్తాయి. కాబట్టి.. కంటిసమస్యతో బాధపడుతున్నవారు ఈ స్వీట్ కార్న్ ప్రతిరోజూ తీసుకుంటే ఫలితం పొందవచ్చు.

అలాగే.. ఈ స్వీట్ కార్న్ లో అరటిపండ్లలో కంటే చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అరటిపండ్లలో 15 గ్రాముల చక్కెర ఉండగా.. వీటిలో మాత్రం కేవలం 6 నుంచి 8 గ్రాములే ఉంటుంది. కాబట్టి.. షుగర్ వ్యాధి వున్నవారు ఈ స్వీట్ కార్న్ ని తీసుకోవచ్చు. ఇక ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలున్నాయి కాబట్టి.. ‘స్వీట్ కార్న్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sweet corn health benefits  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more