Shooter Ravi Kumar failed in dope test డోపింగ్ లో ఫెయిల్: తక్కువ శిక్ష విధిస్తారని..

Ravi kumar hopes for light punishment for inadvertent doping violation

Ravi Kumar, Shooting, propranolol, National Anti-Doping Agency, NADA, doping, Indian shooter, World cup shooting, 10m Air Pistol, Bronze Medal, Gold Coast Commonwealth Games, 2014 Asian Games, sports, shooting, sports news, shooting news, sports, cricket

World Cup medal-winning rifle shooter Ravi Kumar, who has failed a dope test, says his is a case of inadvertent intake, an explanation he hopes would fetch him a lighter-than-expected punishment from the National Anti-Doping Agency (NADA).

డోపింగ్ లో ఫెయిల్: తక్కువ శిక్ష విధిస్తారని..

Posted: 12/11/2019 08:12 PM IST
Ravi kumar hopes for light punishment for inadvertent doping violation

డోపింగ్‌ పరీక్షలో విఫలమైన తనకు నాడా తక్కువ శిక్ష విధించగలదని షూటర్‌ రవికుమార్‌ (29) అంటున్నాడు. వైద్యం కోసం ఉపయోగించిన ఔషధంలో నిషేధిత ఉత్ప్రేరకం ఉందన్న సంగతి తనకు తెలియదన్నాడు. మేలో మ్యూనిచ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో అతడు పతకం సాధించాడు. గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లోనూ కాంస్యం అందుకున్నాడు. ఓ దేశవాళీ పోటీకి ముందు పరీక్షించిన రవికుమార్‌ నమూనాల్లో వాడా నిషేధిత ప్రొప్రనొలాల్‌ ఉన్నట్టు తేలింది.

‘మైగ్రేన్‌కు వైద్యం కోసం ఔషధాలు తీసుకున్నాను. మే-జూన్‌లో కుమార్‌  సురేంద్రనాథ్‌ స్మారక పోటీలకు ముందు నేనింట్లో ఉన్నప్పుడు వైద్యుడు నాకది సిఫార్సు చేశారు. ప్రతిదీ నాడాకు వివరించాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న నాడా పరీక్షకు ముందు ఈ విషయం చెప్పకపోవడమే తప్పని తెలిపింది. ఆ ఔషధంలో షూటింగ్‌లో నిషేధించిన ఉత్ప్రేరకం ఉంది. దానిని మైగ్రేన్‌, అధిక రక్తపోటు కోసం వాడతారు. తెలియక తీసుకోవడంతో నాకు అనుకూలంగానే తీర్పు ఉంటుందని భావిస్తున్నా. నేనొక క్రీడాకారుడినని వైద్యుడికీ చెప్పాను. నా చివరి ప్రపంచకప్‌ను మ్యూనిచ్‌లో ఆడాను. ఒలింపిక్స్‌లో ఆడేందుకు నాలుగేళ్ల పడిన కష్టం ఇక బూడిదలో పోసిన పన్నీరే అనిపిస్తోంది’ అని రవికుమార్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Kumar  Shooting  propranolol  National Anti-Doping Agency  NADA  doping  Indian shooter  sports  shooting  

Other Articles