Abhishek Verma wins gold in maidden final గురిచూసి స్వర్ణాన్ని కొట్టిన అభిషేక్ వర్మ..

Shooting world cup abhishek verma wins gold in maidden final

Apurvi Chandela, Abhishek Verma, Abhishek verma maiden goldmedal, shooting world cup, ISSF World Cup, International Shooting Sport Federation, Cricket, sports

Abhishek Verma secured India's fifth Olympic quota place in shooting by winning the 10m air pistol gold medal at the ISSF World Cup here Saturday.

గురిచూసి స్వర్ణాన్ని కొట్టిన అభిషేక్ వర్మ..

Posted: 04/27/2019 05:00 PM IST
Shooting world cup abhishek verma wins gold in maidden final

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ వరల్డ్ కప్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. 10మీటర్ల ఎయిర్‌ పిస్ట్‌ల్‌ విభాగంలో ఇతడికి బంగారు పతకం లభించింది. దీంతో అభిషేక్‌ ఒలింపిక్స్‌ బెర్తును కూడా ఖాయం చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు.

ఇలా ప్రపంచ కప్‌ బరిలోకి దిగడం అభిషేక్‌కిది రెండో సారి. ఈ రోజు జరిగిన ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 242.7 పాయింట్లతో ఇతడికి స్వర్ణం దక్కగా.. 240.4 పాయింట్లతో రష్యన్ షూటర్‌ ఆర్టెమ్‌ చెర్నోసోవ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌ ఫైనల్లో స్వర్ణం సాధించిన సౌరబ్‌ చైదరి కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhishek Verma  gold medal  shooting world cup  issf world cup  sports  cricket  

Other Articles