Gopichand: 'Sindhu didn’t fire as expected' నాకు ఫైనల్ ఫోబియా లేదు: పివీ సింధూ

Gopichand not worried by sindhu s defeats in finals

PV Sindhu, Sindhu, PV sindhu Carolina Marin, Marin Sindhu, sindhu Marin, Pullela Gopichand, Pullella gopi chand, gopichand, badminton national coach, indian chief national coach, indian badminton coach, india nation badminton coach, india badminton, badminton world championships, BWF world championship, badminton world championship final, world championship final, BWF world championship final 2018, Carolina Marin, sports news, latest sports news, sports

Pullela Gopichand felt PV Sindhu could have done better in her world championship final loss to Carolin Marin but believes results don’t reflect her consistency.

నాకు ఫైనల్ ఫోబియా లేదు: పివీ సింధూ

Posted: 08/07/2018 04:31 PM IST
Gopichand not worried by sindhu s defeats in finals

తన స్వయంకృత అపరాధంతోనే స్వర్ణం చేజారిందని.. బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ పోటీ ఫైనల్ లో తాను చేసిన కొన్ని తప్పుల కారణంగానే ఓటమిపాలయ్యానని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అవేదన వ్యక్తం చేసింది. స్పెయిన్ ప్లేయర్ కరోలిన మారిన్ పై గెలిచేందుకు చివరి వరకు ప్రయత్నించానని చెప్పిన అమె.. తన ఆటతీరు ఇంకా మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. కాగా, అందరూ తనకు ఫైనల్ ఫోబియా వుందని అంటున్నారని అయితే తనకు అసలు ఫైనల్‌ ఫోబియా అనేదే లేదని అన్నారు.

ఫైనల్ వరకు రావాలంటే ఎంతో కష్టపడాలని చెప్పిన సింధూ.. తాను తొలి రౌండ్ నుంచి ఎంతో  కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నానని తెలిపింది. ఫైనల్లో కూడా గెలవాలనే ఆడానని చెప్పిన ఇండియన్ స్టార్ షెట్లర్.. ఫైనల్స్ లో తన ప్రత్యర్థి స్పెయిన్ స్టార్ కరోలినా మారీన్ తెలివిగా ఆడిందని చెప్పుకోచ్చింది. చైనాలోని నంజింగ్ ఫైనల్ మ్యాచ్ లో పోరాడి ఓడిన సింధూ.. స్వదేశానికి చేరుకున్న తర్వాత కోచ్ పుల్లెల గోపిచంద్ తో కలసి మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.

ఫైనల్లో ఓడిపోయానని బాధపడే బదులు.. తన ఖాతాలో మరో మెడల్ వచ్చిందని సంతోషపడతానని చెప్పారు. వచ్చే ఏడాది తనకు గోల్డ్ మెడల్ వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. ఫైనల్లో ఎవరైనా గెలవడానికే ఆడతారని చెప్పారు. ఫైనల్లో ఒడిపోయినందుకు కొంత బాధ ఉన్నప్పటికీ.. తన బలహీనతల నుంచి మరింత నేర్చుకుని అనుకున్న ఫలితం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని  సింధు తెలిపారు. షట్లర్లు క్రిటికల్ పొజిషనల్ ఒత్తిడికి లోనుకాకుండా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇంకా శిక్షణ ఇవ్వాల్సి ఉందని కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coach Pullela Gopichand  PV Sindhu  Carolina Marin  BWF world championship  sports  

Other Articles