న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు ముందుకు దూసుకెళ్లారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో సత్తా చాటిని భారతీయ షెటర్లు ఇక మరో సమరంలోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. న్యూజీల్యాండ్ ఓపెన్ లో పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్, సౌరవ్ వర్మ, సిరిల్ వర్మలు ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. ఇవాళ జరిగిన రెండో రౌండ్ పోరులో వారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరారు.
గత నెలలో జరిగిన యూఎస్ ఓపెన్ లో టైటిల్ ను సాధించి మంచి జోరుమీదున్న ప్రణయ్ తన ప్రత్యర్థి ఇండోనేషియాకు చెందిన ఫిర్మ్యాన్ అబ్దుల్ కొల్హిక్ ను 23-21, 21-18 తేడాతో ఓడించి ఫ్రిక్వార్టర్స్ లోకి వెళ్లగా, కామన్ వెల్త్ గేమ్స్ లో తన సత్తా చాటిన కశ్యప్ అథిత్య దేశం న్యూజీలాండ్ క్రీడాకారుడు ఒస్కార్ గుతో తలపడి 21-9, 21-8 తేడాతో సునాయాసంగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరాడు. ఇక సౌరవ్ 21-16, 21-16 తో ఖో విబోవు(ఇండోనేసియా)పై, సిరిల్ వర్మ 21-14, 21-16తో విక్కీ అంగ్గా(ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more