Jwala Gutta slams social media trolls for calling her 'anti-national' ట్విట్టర్ ఫాలోవర్ పై గుత్తా అగ్రహ ‘జ్వాల’

Troll tries to target jwala gutta saying her mother is anti modi

Yelan Gutta, Narendra Modi, jwala gutta twitter jibe, jwala gutta twitter, Jwala Gutta, Badminton news, Badminton, sports news, latest news

Social media trolls found a new target in badminton star Jwala Gutta as they attacked her on Twitter for being 'anti-national', since her mother hails from China.

నేరుగా ప్రశ్నించు.. మద్యలో వారినెందుకు లాగుతావ్.?

Posted: 07/31/2017 07:37 PM IST
Troll tries to target jwala gutta saying her mother is anti modi

భారత డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల.. తన అభిమానులతో సరదాగా వుంటారు. ఎవరు ఏ విధమైన ట్విట్లను పెట్టినా.. అమె ఎలాంటి మోహమాటం లేకుండా సూటిగా బదులిస్తారు. తాజాగా అమె తన అభిమానిపై తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఇక నుంచి నా నుంచి నీకు ఎలాంటి సమాధానాలు రావు అని ఖరాఖండిగా చెప్పేశారు. అసలేం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం జ్వాల ఓ వీడియోను తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో జ్వాల తన సోదరితో కలిసి పాట పాడుతూ ఉండగా.. వారి తల్లి ఇన్సి గుత్తా కూడా వీడియోలో కనిపిస్తారు.

తాజాగా ఓ అభిమాని ‘మీ తల్లి చైనా వారు కాబట్టి మీరు ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా.?. అనడంతో వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం నడిచింది. దీంతో ‘ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో’ అని ఘాటుగా సమాధానం ఇచ్చింది జ్వాల. అంతేకాదు అన ఫాలోవర్ పై వున్న గౌరవం పోయింది. ఇక తన నుంచి అతడికి ఏ సమాధానాలు రావని కూడా లేద్చిచెప్పింది. ఏదైనా అడగాలనుకుంటే నేరుగా ప్రశ్నించు.. అంతేకాని నా తల్లిదండ్రుల గురించి ప్రస్తావన తీసుకువస్తే.. నాలో మరో కోణాన్ని చూస్తావు. గుర్తుపెట్టుకో’ అని పేర్కొన్నింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles