HS Prannoy clinches US Open title యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన ప్రణయ్.. రన్నరప్ కశ్యప్

Hs prannoy beats parupalli kashyap to lift us open badminton title

Parupalli Kashyap, HS Prannoy, final, US Open Grand Prix, Kwang Hee Heo, Tien Minh Nguyen, baminton news, sports, sports news, badminton

The Indian juggernaut in men's badminton continued to roll on with former Commonwealth Games gold medallist Parupalli Kashyap set up title date with HS Prannoy at the USD 120,000 US Open Grand Prix Gold

యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన ప్రణయ్.. రన్నరప్ కశ్యప్

Posted: 07/24/2017 01:08 PM IST
Hs prannoy beats parupalli kashyap to lift us open badminton title

యూఎస ఓపెన గ్రాండ ప్రి గోల్డ్ టోర్నీలో తనదైన అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ టైటిల్ ను సాధించాడు. మరో భారత అగ్రశ్రేణి ఆటగాడు, తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ తో ఫైనల్లో తలపడిన ప్రణయ్.. కశ్యప్ పై పైచేయి సాధించి టైటిల్ ను వశం చేసుకున్నాడు. దీంతో ప్రణయ్ తన కెరీర్ లో మూడో గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్స్ లో ప్రణయ్ 21-15, 20-22, 21-12 తేడాతో కశ్యప్ పై విజయం సాధించాడు.

ఇద్దరు భారత అటగాళ్ల మద్య సుమారు గంటా ఐదు నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచులో ఇద్దరి మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగినా.. చివరకు ప్రణయ్ పై చేయి సాధించాడు. మొదటి గేమ్‌ను ప్రణయ్ 21-15 తేడాతో గెలుచుకున్నాడు. తర్వాతి గేమ్‌లో పుంజుకున్న కశ్యప్ విరోచితంగా పోరాడి 22-20తేడాతో గెలిచాడు. నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌లో ప్రణయ్ సునాయసంగా గెలుచుకుని యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్‌లో కొత్త విజేతగా నిలిచాడు.  
 
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన టోర్నీలో మన దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. ఇంతకుముందు శ్రీకాంత్‌, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ ఫైనల్లో తలపడ్డారు. అనంతరం ప్రణయ్ ట్విటర్‌ ద్వారా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌-2017 టోర్నీ విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. అకాడమీలో తనతో పాటు శిక్షణ పొందుతోన్న పారుపల్లి కశ్యప్ పై విజయం సాధించానన్నాడు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు ప్రణయ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parupalli Kashyap  HS Prannoy  final  US Open Grand Prix  Kwang Hee Heo  Tien Minh Nguyen  baminton  

Other Articles